చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ABN , Publish Date - Apr 03 , 2026 | 12:21 AM
మందస మండలం కల్లాడ వద్ద జరిగిన ద్విచక్రవాహనం ప్రమాదంలో గాయపడిన సవర ప్రదీప్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ కృష్ణప్రసాద్ చెప్పారు.
హరిపురం, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): మందస మండలం కల్లాడ వద్ద జరిగిన ద్విచక్రవాహనం ప్రమాదంలో గాయపడిన సవర ప్రదీప్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ కృష్ణప్రసాద్ చెప్పారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. మందస మండలం చీపి గ్రామానికి చెందిన సవర సూర్యారావు, సవర ప్రదీప్ బుధవారం ఒడిశా రాష్ట్రం జరడ గ్రామానికి వెళ్లి.. తిరిగి రాత్రి వస్తుండగా కల్లడ వద్ద అడవిపంది అడ్డంగా రావడంతో వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిద్దర్నీ చికిత్స కోసం హరిపురం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం టెక్కలిలోని జిల్లా కేంద్రాసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రదీప్ గురువారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్ట ఎస్‌ఐ తెలిపారు.