చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:29 AM
కడుపునొప్పి తాళలేక గడ్డి మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాదుర్లపేటకు చెందిన డోర అజయ్ (42) ఆదివారం మృతి చెందినట్టు వన్‌టౌన్ ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు.
శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): కడుపునొప్పి తాళలేక గడ్డి మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాదుర్లపేటకు చెందిన డోర అజయ్ (42) ఆదివారం మృతి చెందినట్టు వన్‌టౌన్ ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు. పోలీసు లు తెలిపిన వివరాల మేరకు.. అజయ్ ఈనెల 10న ఫుడ్‌పాయిజన్‌తో కడుపు నొప్పి తీవ్రం కావడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. కొంచెం కడుపునొప్పి తగ్గడంతో 11న డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే రెండు రోజులుగా నొప్పి వచ్చి తగ్గకపోవడంతో 13న ఇంటిలో ఉన్న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దీనిని గమనించిన అతని భార్య చికిత్స నిమిత్తం నగరంలోని మరో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చించింది. పరిస్థితి విషమిం చడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అజయ్ అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. అజయ్ భార్య సంగీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు.
కొసమాల చర్చిలో చోరీ
మెళియాపుట్టి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): కొసమాల చర్చిలో చోరీ జరిగినట్టు చర్చి నిర్వహకులు సంజీవరావు, వెంకట్ ఫిర్యాదు చేసినట్టు ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు. మెళియాపుట్టి-కొసమాల గ్రామాలకు మధ్యలో ఉన్న ఈ చర్చిలో గత ఆదివారం ప్రార్థనలు చేసి తర్వాత తాళాలు వేయగా.. తిరిగి గడిచి ఆదివారం మళ్లీ ప్రార్థనలు చేసేందుకు వచ్చేటప్పటికి తలుపులు తెరిచి ఉన్నట్టు ఫిర్యాదులో పేర్కొనట్టు తెలిపారు. బీరువాలలో ఉన్న రూ.10 వేలు నగదుతో పాటు 15 తులా లు వెండి పట్టీలు, నాలుగు సీసీ కెమెరాలతోపాటు విద్యుత్ పరికరాలు చోరీ జరిగిన ట్టు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చ ఏస్తున్న ఎస్‌ఐ తెలిపారు.