అదనంగా ధాన్యం కొనుగోలుకు అనుమతి: జేసీ
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:28 PM
: అల్లాడ రైతు సేవా కేంద్రం పరిధిలో అదనంగా వంద మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలుకు అనుమతులు ఇచ్చినట్లు జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ తెలిపారు. ఇక్కడ ధాన్యం కొనుగోలుకు లక్ష్యం పూర్తికావడం తో మరి కొనుగోలు చేయడానికి వీలులేదని అధికారులు తేల్చిచెప్పడంతో రైతులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు.
జలుమూరు, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): అల్లాడ రైతు సేవా కేంద్రం పరిధిలో అదనంగా వంద మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలుకు అనుమతులు ఇచ్చినట్లు జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ తెలిపారు. ఇక్కడ ధాన్యం కొనుగోలుకు లక్ష్యం పూర్తికావడం తో మరి కొనుగోలు చేయడానికి వీలులేదని అధికారులు తేల్చిచెప్పడంతో రైతులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జేసీ గురువారం రైతు సేవా కేంద్రం పరిశీలించి అక్కడ రైతులతో మాట్లాడి విక్రయానికి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని కొనుగోలుకు అనుమతి మంజూరుచేశారు. ఆయన వెంట తహసీల్దార్ జె.రామారావు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
హిరమండలం,జనవరి8 (ఆంధ్రజ్యోతి): ధను పురంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని జేసీ ఫర్మన్ అహ్మద్ ఖాన్ హెచ్చరించారు. ధనుపురంలో ఇటీవల ఓ సైనిక ఉద్యోగి కుటుంబానికి, ఎదురింట్లో నివాస ముంటున్న కుటుంబానికి ఇంటి స్థలానికి సం బంధించి ఘర్షణ చోటుచేసుకుంది. స్థల వివా దం నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా స్థలాన్ని గురువారం జేసీ ఫర్మన్‌అహ్మద్ ఖాన్ పరిశీ లించారు.వివాదానికి కారణమైన స్థలం మొత్తం ప్రభుత్వానికి చెందందని జేసీ తెలిపారు. సైనికి ఉద్యోగి ఇంటి ముందు వేరే వర్గం వారు వేసిన కంచెను తొలగించామని, ఇరువర్గాలు కూడా వివాదానికి కారణమైన స్థలాన్ని ఎటువంటి అవసరాలకు వినియోగించకుడదని చెప్పారు.