సింగిల్ విండోలో గణేష్ ఉత్సవాలకు అనుమతి
ABN , Publish Date - Sep 12 , 2026 | 11:42 PM
వినాయక చవితి ఉత్సవా లను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహిం చుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్
శ్రీకాకుళం అర్బన్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): వినాయక చవితి ఉత్సవా లను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహిం చుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. విజయ గణపతి ఆలయంలో జిల్లా గణేష్ ఉత్సవ సమితి ఆధ్వ ర్యంలో కరపత్రాలు, జెండాలు, బ్యానర్లను శని వారం ఆవిష్కరించారు. మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు పొందాలన్నారు. కార్యక్ర మంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గురూజీ, విష్ణుమూర్తి, గొద్దు భాస్కరరావు, శ్రీరంగం మధుసూదనరావు, వీనస్ హరి తదితరులు పాల్గొన్నారు.
‘మట్టి గణనాథులకు పూజించండి’
శ్రీకాకుళం కల్చరల్, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): పర్యావరణ హితమే లక్ష్యంగా మట్టి గణనాథుల విగ్రహా లకు పూజించాలని ఉపనిషన్మందిరం అధ్యక్షుడు గుమ్మా నగేష్ అన్నారు. గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా శనివారం నగరంలోని కోదండ రామాలయంలో మట్టి గణనాథుల విగ్రహాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మందిరం ప్రతినిధులు కామేశ్వరరావు, నిక్కు అప్పన్న, డా.కోమలరావు, అర్చకుడు బంకుపల్లి శేషాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
‘మట్టి విగ్రహాలనే వినియోగించండి’
పలాస, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): పర్యావరణానికి విఘాతం కలగకుండా వినాయకుడి మట్టి విగ్రహాలనే వినియోగించాలని పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు, షిరీ సాయి సంస్థాన్ ట్రస్టు చైర్మన్ దువ్వాడ శ్రీధర్ కోరారు. శనివారం శివాజినగర్‌లో వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో భూగ ర్భజలాలు కలుషి తమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ మట్టి విగ్రహాలకు పూజించాలన్నారు.
‘పర్యావరణానికి పాటుపడాలి’
ఇచ్ఛాపురం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దామని, పర్యావరణ పరి రక్షణకు పాటుపడదామని ప్రముఖ వైద్యుడు ఉలాల శేషుయాదవ్ అన్నారు. గణేశ ఉత్సవాల నేపథ్యంలో శనివారం ఎకో ఫ్రెండ్లీ గణేశ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసన్నపేట జంక్షన్ వద్ద 500 మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో న్యాయవాది ఉలాల భారతీ దివ్య తదితరులు పాల్గొన్నారు.
‘పర్యావరణ హితంగా పూజిద్దాం’
ఇచ్ఛాపురం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): పర్యావరణ హితంగా మట్టి గణపతులను పూజిద్దామని ఆంధ్ర ప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర సభ్యుడు విష్ణు మూర్తి, హిందూ ధార్మిక సేవా సమితి సభ్యుడు పాక తులసీదాస్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు పట్టణంలో ఏర్పాటు చేయనున్న పలు వినాయక మండపాలను శనివారం సందర్శించి పూజా విధానం, సంప్రదాయాలపై నిర్వాహ కులకు సూచనలిచ్చారు. పర్యావరణ హితంగా నిర్వహిం చే మండపాలకు ప్రోత్సా హకాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కరరావు, ఉమామహేశ్వరరావు, సదాశివుని శ్రీను, శ్యాంకుమార్, జైకృష్ణ, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ
రణస్థల, సెప్టంబరు 12 (ఆంధ్రజ్యోతి): వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిఖిల నాయుడు కలిశెట్టి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపీ సతీమణి, ట్రస్ట్ డైరెక్టర్ కలిశెట్టి ప్రభనాయుడు శనివారం మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మీసాల రమేష్ తది తరులు పాల్గొన్నారు.