నిబంధనల ప్రకారం విధులు నిర్వహించండి
ABN , Publish Date - Nov 06 , 2026 | 12:35 AM
నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించాలని కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూము ఇన్‌చార్జి, జడ్పీ డిప్యూటీ సీఈవో భారతీ సౌజన్య కోరారు. గురువారం జిల్లాలో జరిగిన ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలను కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు నిరంతరం పర్య వేక్షించారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, నవంబరు 5(ఆంధ్రజ్యోతి):నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించాలని కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూము ఇన్‌చార్జి, జడ్పీ డిప్యూటీ సీఈవో భారతీ సౌజన్య కోరారు. గురువారం జిల్లాలో జరిగిన ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలను కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు నిరంతరం పర్య వేక్షించారు. ఈసందర్భంగా జిల్లాలోని పోలింగ్ కేంద్రాలను కంట్రోల్ రూము నుంచి వీడియోల ద్వారా పరిశీలించి, పోలింగ్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ మేరకు గార మండలంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓ అధికారి ఓటర్లు ఓటువేస్తున్న క్యాబిన్ వద్ద నిల్చుని ఉండడాన్ని గమనించిన సౌజన్య, అధికారులు ఓటు వేసే క్యాబిన్ వద్ద ఉండరాదని, వెంటనే తన సీటు వద్దకు వెళ్లాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.