అరసవల్లి సిరిమానోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:11 AM
నగరంలో పదేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా జరిగే అరసవల్లి అసిరితల్లి సిరిమానోత్సవం నిర్వ హణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): నగరంలో పదేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా జరిగే అరసవల్లి అసిరితల్లి సిరిమానోత్సవం నిర్వ హణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. సోమ వారం స్థానిక మున్సిపల్ మైదానంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే గొండు శంకర్‌లతో కలిసి ఉత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ.. ఏప్రిల్ 28న జరిగే సిరిమానోత్సవానికి లక్ష మంది, 29న జరిగే పండుగ భోజనాలకు సుమారు 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, పోలీసు, అగ్నిమాపక శాఖలు సమ న్వయంతో పనిచేయా లని సూచించారు. శోభాయాత్ర సాగే మార్గాల్లో విద్యుత్ తీగెలు అడ్డంగా ఉండరాదని, ట్రాఫిక్ నియంత్రణతో పాటు మంచినీరు, పారి శుధ్య నిర్వహణ, వైద్య బృందాలు నిరంతరం అందు బాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ 25 నుంచి ప్రారంభమయ్యే సాంస్కృతిక కార్యక్రమా లతో పాటు 26న జరిగే శోభాయాత్ర కు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీని కోరారు. సమావేశంలో ఆర్డీవో సాయి ప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, నగరపాలక కమిషనర్ కూర్మారావు, తహసీల్దారు గణపతిరావు పాల్గొన్నారు.