ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Sep 20 , 2026 | 11:42 PM
వాయుగుండం హెచ్చరికలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఒక ప్రకటనలో తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
పాతపట్నం, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): వాయుగుండం హెచ్చరికలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఒక ప్రకటనలో తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అప్రమత్తం చేయాలని కోరారు. ప్రజలకు అత్యవసరసేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.
గ్రామాల్లో దండోరా వేయాలి
వజ్రపుకొత్తూరు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తుఫాన్ హెచ్చరికల నేపద్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మండల తుఫాన్ ప్రత్యేకాధికారి, మత్స్యశాఖ ఉపసంచాలకురాలు టి.సుమలత తెలిపారు. ఆదివారం వజ్రపుకొత్తూరులో అధికారు లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం నుంచి ఈనెల 24 తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్ళకుండా గ్రామాల్లో దండోరా వేయాలన్నారు. మత్స్యకారులు వలలు, బోట్లు, తెప్పలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్రామస్థాయి అధికారులు అందు బాటులో ఉండాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ సీతారామయ్య, ఎంపీడీవో ఎన్.జరమేష్‌నాయుడు, డీటీ శ్రావణ్‌కుమార్, సాగర్ మిత్ర నాగరాజు పాల్గొన్నారు.
ఫపోలాకి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): అల్పపీడనం వల్ల సాగర, నదీతీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేకాధికారి వెంకటమధు తెలిపారు. ఆదివారం పోలాకిలో సచివాలయ, అధికార సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తహసీల్థార్ పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈనెల 25వతేదీ వరకూ మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని, ఇందుకోసం స్థానిక అధికారులను ప్రత్యేక పరిశీలకులుగా నిమమించామని ఎంపీడీవో సూర్యప్రకాష్ తెలిపారు.
నీటి ప్రవాహం పెరిగే అవకావం: తహసీల్దార్
జలుమూరు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో నదీతీర గ్రామాల ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని, ఈమేరకు గ్రామాల్లో దండోరా వేయించామని తహసీల్దార్ జె.రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఒడిశాలో భారీ వర్షాలు కురిసి వంశధారనది నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు నదిలో గొర్రెలు, మేకలు, పశువులు ఉంచరాదని అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. ఆయా గ్రామాల వీఆర్వోలను అప్రమత్తం చేసి తీర ప్రాంత గ్రామాల్లో దండోరా వేయించినట్లు తెలిపారు. నదిలోకి స్నానాలు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండి నీటి ప్రవాహం చూసుకోవాలని కోరారు.
111111111111