Share News

కూటమి పాలనలో ప్రజలు సంతృప్తి

ABN , Publish Date - May 03 , 2026 | 12:08 AM

కూటమి పరిపాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, అందుకు నిదర్శనం విన తులు తగ్గడమేనని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. రామయ్యపుట్టుగలో ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ కార్యాలయంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ఎమ్మెల్యే అశోక్‌తో కలిసి శనివారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

 కూటమి పాలనలో ప్రజలు సంతృప్తి
కవిటి: కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడుకు సమస్యలను వివరిస్తున్న కవిటి మండల నేతలు

కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు

ఎమ్మెల్యే అశోక్‌ కార్యాలయంలో ప్రజాదర్బార్‌

కవిటి, మే 2(ఆంధ్రజ్యోతి): కూటమి పరిపాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, అందుకు నిదర్శనం విన తులు తగ్గడమేనని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. రామయ్యపుట్టుగలో ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ కార్యాలయంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ఎమ్మెల్యే అశోక్‌తో కలిసి శనివారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నేరేడి బ్యారేజీ విషయంలో ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడి లైన్‌క్లియర్‌ చేయడంతో ఇచ్ఛాపురానికి సాగునీరందేలా చర్యలు తీసుకునేందుకు మార్గం సుగమం కానుండ డంతో వంశధార జలసాధన సమితి సభ్యులు, రైతులు సంతోషం వ్యక్తం చేశారు. సాగునీటి వనరులు అభివృద్ధి చేస్తే రైతులకు మేలు కలుగుతుందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రైతులకు చెందిన భూము లు నోషనల్‌ ఖాతాలోకి మారడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. విద్యుత్‌శాఖ పరంగా సమస్యలు ఉత్పన్నమౌతున్నాయని వాటిని పరి ష్కరించాలని పలువురు కోరారు. వ్యక్తిగత సమస్యలను అధికారులతో వెంటనే మాట్లాడి పరిష్కరించారు. ప్రజా దర్బార్‌లో 138 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో జిల్లా స్థాయి అదికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు.

‘మండల అభివృద్ధికి చేయూత ఇవ్వండి’

కంచిలి, మే 2 (ఆంధ్రజ్యోతి): మండల అభివృద్ధికి నిధులు కేటాయించి చేయూత అందించాలని టీడీపీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు, కార్యదర్శి పైల రామారావు, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ కిషోర్‌ పాడికోరారు. ఈ మేరకు శనివారం రామయ్యపుట్టుగలో ఎమ్మెల్యే అశోక్‌ క్యాంపు కార్యాలయంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మో హన్‌ నాయుడును కలిసి వినతిపత్రం అందించారు. అసంపూర్తిగా ఉన్న రోడ్డు, కాలువల పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.

‘మెయిన్‌రోడ్డు విస్తరణ చేపట్టాలి’

సోంపేట, మే 2 (ఆంధ్రజ్యోతి): సోంపేట పట్టణంలోని మెయిన్‌రోడ్డు విస్తరణ చేపట్టాలని స్థానిక నేతలు కోరారు. ఈ మేరకు శనివారం రామయ్యపుట్టుగలోని ఎమ్మెల్యే అశోక్‌ కార్యాలయంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్క ర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. జల్‌జీవన్‌ మిషన్‌లో భాగంగా ఇంటింటికి కుళాయి పనులు పూర్తి చేయించాలని కోరారు. ఇటీవల కురిసిన వర్షాల కార ణంగా నష్టపోయిన టమోటా రైతులకు పరిహారం అం దించాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో టీడీపీ మండల అధ్యక్షుడు మడ్డు కుమార్‌, మాజీ ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

‘మున్సిపాల్టీ సమస్యలు పరిష్కరించండి’

ఇచ్ఛాపురం, మే 2 (ఆంఽధ్రజ్యోతి): ఇచ్ఛాపురం మున్సి పాల్టీలోని ప్రఽధాన సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడును నియోజక వర్గ తెలుగుయువత అధ్యక్షుడు కాళ్ల జయదేవ్‌, టీడీపీ సీనియర్‌ నాయకుడు కాళ్ల ధర్మారావు కోరారు. ఈ మేర కు శనివారం రామయ్యపుట్టుగలోని ఎమ్మెల్యే అశోక్‌ కా ర్యాలయంలో వినతిపత్రం అందించారు. 20వ వార్డు కొండపోలమ్మ కాలనీ గాంఽధీనగర్‌ కాలనీల్లో రోడ్లు, కాలు వలు, తాగునీరు, వీధి దీపాల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైల్వే నార్త్‌ క్యాబిన్‌ సమీపంలో ఎల్‌సీ నెంబరు 329 వద్ద ఆర్‌ఓబీ నిర్మా ణానికి తగిన ప్రదేశాన్ని ఖరారు చేసి పనులు వేగవం తం చేయాలని, అదే ప్రాంతంలో ఆర్‌వోబీ పనులు త్వరతిగతిన పూర్తి చేయాలని కోరారు. అలాగే 1, 2, 3, 21, 22 వార్డులలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

Updated Date - May 03 , 2026 | 12:08 AM