Share News

పింఛన్ల పంపిణీ భేష్‌!

ABN , Publish Date - Aug 14 , 2026 | 12:07 AM

Satisfaction with pension distribution రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తు న్న ‘ఎన్టీఆర్‌ భరోసా’ పింఛన్ల పంపిణీ ప్రక్రియపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని సెర్ప్‌ పింఛన్లు, హెచ్‌డీ విభాగాల డైరెక్టర్‌ బి.సుధాకర్‌రావు తెలిపారు. గురువారం జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో ఆయన డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ కిరణ్‌కుమార్‌తో కలిసి పింఛన్ల పథకం అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు.

పింఛన్ల పంపిణీ భేష్‌!
సమావేశంలో మాట్లాడుతున్న సెర్ప్‌ డైరెక్టర్‌ సుధాకర్‌ రావు

చేతివాటం ప్రదర్శిస్తే కఠినచర్యలు

సెర్ప్‌ డైరెక్టర్‌ సుధాకర్‌ రావు

శ్రీకాకుళం, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తు న్న ‘ఎన్టీఆర్‌ భరోసా’ పింఛన్ల పంపిణీ ప్రక్రియపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని సెర్ప్‌ పింఛన్లు, హెచ్‌డీ విభాగాల డైరెక్టర్‌ బి.సుధాకర్‌రావు తెలిపారు. గురువారం జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో ఆయన డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ కిరణ్‌కుమార్‌తో కలిసి పింఛన్ల పథకం అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. పింఛన్ల పంపిణీకి సంబంధించి ఐవీఆర్‌ఎస్‌ విధానం ద్వారా సేకరించిన ప్రజాభిప్రాయ నివేదికను విడుదల చేశారు. గత జనవరి నుంచి జూలై వరకు సేకరించిన సమాచారం ప్రకారం.. జిల్లావ్యాప్తంగా 92 శాతానికి పైగా లబ్ధిదారులు పింఛన్ల పంపిణీపై సంతృప్తితో ఉన్నారని వెల్లడించారు. ప్రతి నెల మొదటి తేదీనే నేరుగా ఇంటికే పింఛన్‌ అందుతోందని 93 శాతానికిపైగా హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. ఇక గత నెలలో సచివాలయ సిబ్బంది పనితీరుపై 90.97శాతం మంది ప్రశంసలు కురిపించారన్నారు. కాగా.. పింఛన్ల పంపిణీలో ఎవరైనా చేతివాటం ప్రదర్శిస్తే కఠినచర్యలు తప్పవని డైరెక్టర్‌ సుధాకర్‌రావు హెచ్చరించారు. గత నెల నివేదికలో 84.46 శాతం మంది ఎలాంటి అవినీతి చోటుచేసుకోలేదని స్పష్టం చేసినప్పటికీ.. అక్కడక్కడా నమోదవుతున్న స్వల్ప ఫిర్యాదులను సైతం ఉపేక్షించవద్దని అధికారులను ఆదేశించారు. శతశాతం పారదర్శకం గా పింఛన్ల పంపిణీ చేసేలా.. క్షేత్రస్థాయి సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించా లని తెలిపారు. సమావేశంలో జడ్పీ సీఈవో వెంకటరామన్‌, డీఆర్డీఏ ఉన్నతాధికారులతో పాటు వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2026 | 12:07 AM