Share News

నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శనగ కొనుగోళ్లు

ABN , Publish Date - Feb 17 , 2026 | 11:20 PM

ఆరు గాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శనగ కొనుగోళ్లు
అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ఆరు గాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా శనగ కొనుగోలు ప్రక్రియను తక్షణం ప్రారంభించా లని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు ఆదేశించారు. రబీ సీజన్‌ (2025- 26)లో పండించిన శన గలకు మద్దతు ధర కల్పించి కొను గోలు చేసేందుకు కేంద్రం నుంచి మంగళవారం అనుమతులు లభించాయని, ఈ మేరకు బుధవారం నుంచే క్షేత్రస్థాయిలో కొనుగోళ్లు మొదలవుతాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

దళారులను నమ్మొద్దు

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) ద్వారానే తమ పంటను విక్రయించుకోవాలని మంత్రి సూచించారు. నాఫెడ్‌, ఎన్‌సీసీఎఫ్‌ ఏజెన్సీల ద్వారా సుమారు 94,500 మెట్రిక్‌ టన్నుల శనగలను సేకరించను న్నామన్నారు. ఇందుకోసం జిల్లాల్లో జాయింట్‌ కలెక్టర్ల నేతృత్వంలోని డీఎల్‌పీసీ బృందాలు పర్యవేక్షి స్తాయన్నారు.

Updated Date - Feb 17 , 2026 | 11:20 PM