ప్రశాంతంగా పాలిసెట్
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:44 PM
policet exam పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి జిల్లాలో 42 కేంద్రాల్లో శనివారం నిర్వహించిన ఏపీ పాలిసెట్ ప్రశాంతంగా జరిగింది. శ్రీకాకుళం, టెక్కలి, పలాస ప్రాంతీయ కేంద్రాల్లో పాలిసెట్ నిర్వహించారు.
ఎచ్చెర్ల, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి జిల్లాలో 42 కేంద్రాల్లో శనివారం నిర్వహించిన ఏపీ పాలిసెట్ ప్రశాంతంగా జరిగింది. శ్రీకాకుళం, టెక్కలి, పలాస ప్రాంతీయ కేంద్రాల్లో పాలిసెట్ నిర్వహించారు. శ్రీకాకుళం ప్రాంతీయ కేంద్రాల పరిధిలో 6,899 మంది విద్యార్థులకు 6,478 మంది, టెక్కలి పరిధిలో 2,559 మందికి 2,427 మంది, పలాస పరిధిలో 2,446 మందికి 2,324 మంది హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 11,904 మందికి 11,219 మంది పాలిసెట్ రాశారు. ఇందులో బాలురు 6,204 మంది, బాలికలు 5,015 మంది ఉన్నారు. ఉన్నత విద్యాశాఖ(పాలిటెక్నిక్) శిక్షణ, ప్లేస్‌మెంటు విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎంఏవీ రామకృష్ణ, జిల్లా సమన్వయకర్త డాక్టర్ కె.నారాయణరావు పలు కేంద్రాలను పరిశీలించారు.