Share News

వేదాంత విధానంతోనే ప్రశాంతత

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:08 AM

జాతీయ వేదాంత విధానమే ప్రపంచ శాంతికి మార్గదర్శకమని అలహా బాద్‌ విశ్వవిద్యాలయం ఫిలాసఫీ ప్రొఫెసర్‌ సూర్యకాంత్‌ మహారాజా అన్నారు.

 వేదాంత విధానంతోనే ప్రశాంతత
అతిథులకు ప్రశంసాపత్రాలు అందిస్తున్న వీసీ కేఆర్‌ రజని

అలహాబాద్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ సూర్యకాంత్‌

ఎచ్చెర్ల రూరల్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జాతీయ వేదాంత విధానమే ప్రపంచ శాంతికి మార్గదర్శకమని అలహా బాద్‌ విశ్వవిద్యాలయం ఫిలాసఫీ ప్రొఫెసర్‌ సూర్యకాంత్‌ మహారాజా అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాల యంలో శాంతి-విభిన్న సంస్కృతులపై నిర్వహిం చిన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు శుక్ర వారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనిషి ప్రశాంతంగా జీవించా లంటే శాంతి నెలకొల్పాలన్నారు. అంతర్జాతీయం గా శాంతి కొనసాగాలంటే శాంతి, సహనం, మానవత్వం అవసర మ న్నారు. పాటలీపుత్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ అభాసింగ్‌ మాట్లాడు తూ.. ఆరోగ్యం, శాంతికి దోహదం చేసే యోగాను ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆచరిస్తుండడం ఆనందకరమన్నారు. అనంతరం అతిథులను వీసీ ప్రొఫెసర్‌ కేఆర్‌ రజని సత్కరించారు. హాజరైన వారికి ధ్రువీకరణ పత్రాలు అందించారు. కార్య క్రమంలో రిజి స్ట్రార్‌ బి.అడ్డయ్య, నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వపు వీసీ బాలమోహన్‌ దాస్‌, సదస్సు కన్వీనర్‌ సంతోష్‌ రంగనాథ్‌, ప్రిన్సిపాళ్లు ఎం.అనూరాధ, సీహెచ్‌ రాజశేఖర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2026 | 12:09 AM