Share News

గంజాయి స్మగ్లర్‌పై ‘పీడీ యాక్ట్‌’

ABN , Publish Date - Jun 22 , 2026 | 11:49 PM

జిల్లాలోని ఇచ్ఛాపురం కేంద్రంగా గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న ఓ యువకుడిపై రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్‌ (ప్రివెంటివ్‌ డిటెన్షన్‌)ను నిర్ధారించింది. ఇచ్ఛా పురం మునిసిపాలిటీ పరిధి పురుషో త్తపురం గ్రామం చిన్నవీధికి చెంది న బుగ్గ చిరంజీవి (23) నిరంతరాయంగా గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

గంజాయి స్మగ్లర్‌పై ‘పీడీ యాక్ట్‌’

ఒడిశా నుంచి ఇచ్ఛాపురానికి రవాణా

నిందితుడు చిరంజీవికి ఏడాది జైలు శిక్ష, ఉత్తర్వులు జారీ

శ్రీకాకుళం, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఇచ్ఛాపురం కేంద్రంగా గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న ఓ యువకుడిపై రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్‌ (ప్రివెంటివ్‌ డిటెన్షన్‌)ను నిర్ధారించింది. ఇచ్ఛా పురం మునిసిపాలిటీ పరిధి పురుషో త్తపురం గ్రామం చిన్నవీధికి చెంది న బుగ్గ చిరంజీవి (23) నిరంతరాయంగా గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

లారీ డ్రైవర్లే టార్గెట్‌..

ఒడిశా రాష్ట్రం చంద్రగిరి ప్రాంతానికి చెందిన మాన్యువల్‌ బీరా నుంచి నిందితుడు చిరంజీవి గంజాయిని కొనుగోలు చేసి అక్కడి నుంచి ఇచ్ఛా పురం తీసుకువచ్చి లారీ డ్రైవర్లు, ఇతరులకు విక్రయిస్తున్నాడు, ఇతనిపై ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ తీరు మార్చుకోకుండా, నేరాలకు పాల్పడుతూ ప్రజారో గ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తుండడంతో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ నివేదిక మేరకు ప్రభుత్వం అప్రమత్తమైంది. ‘పిట్‌ ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌- 1998’ లోని సెక్షన్‌ 3(1) కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసింది.

అడ్వైజరీ బోర్డు నివేదిక మేరకు..

ఈ కేసుకు సంబంధించి జస్టిస్‌ నీలం సంజీవరెడ్డి (రిటైర్డ్‌) నేతృ త్వంలో అడ్వైజరీబోర్డు జూన్‌ 8న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది. ఈ విచారణలో దర్యాప్తు అధికారి, నిందితుడి భార్య దుర్గమ్మ వాంగ్మూలాలను బోర్డు పరిశీలించింది. నిందితుడిపై పీడీ యాక్ట్‌ నమో దుకు బలమైన కారణాలున్నాయని బోర్డు ఏకగ్రీవంగా స్పష్టం చేసి ప్రభు త్వానికి నివేదిక ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం నిందితుడు బుగ్గ చిరంజీవికి 12 నెలల జైలుశిక్ష ఖరారు చేసింది. ఈ శిక్ష ఈ ఏడాది మే 31 నుంచి అమలులో ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా సోమవారం జీవోఆర్టీ 1077 జారీ చేశారు. నిందితుడిని ప్రస్తుతం విశాఖపట్నం సెంట్రల్‌ జైలులో ఉంచారు.

Updated Date - Jun 22 , 2026 | 11:49 PM