రేపు పీసీసీ చీఫ్ షర్మిల పర్యటన
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:56 PM
Rachchabanda in Korlakota పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు తెలిపారు.
కొర్లకోటలో ‘ఉపాధి’పై రచ్చబండ
డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు
అరసవల్లి, మార్చి 14(ఆంధ్రజ్యోతి): పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు తెలిపారు. శనివారం స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఉపాధిహామీ పథకాన్ని.. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం(బీజేపీ) వీజీ రామ్‌జీ పథకంగా మార్పు చేసి.. వేతనదారులకు తీవ్ర అన్యాయం చేస్తోంది. వేతనదారులకు జరుగుతున్న అన్యాయాలను తెలియజేసేందుకు పీసీసీ చీఫ్ షర్మిల ఉపాధిహామీ పరిరక్షణ యాత్రను చేపడుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆమదాలవలస మండలం కొర్లకోటలో ఉదయం 10.30 గంటలకు రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు రణస్థలంలోని కరిమజ్జి వీధిలో బహిరంగ సభలో పాల్గొంటార’ని తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ఉపాధి వేతనదారులు, ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు రెల్ల సురేష్, నేతలు మంత్రి నర్సింహమూర్తి, ఆబోతుల వెంకటనాయుడు, బొత్స వెంకటరమణ, మామిడి సత్యనారాయణ, ఇజ్జురోతు రమణ, తదితరులు పాల్గొన్నారు.