‘వీఆర్‌ఏలకు పేస్కేల్ అమలు చేయాలి’
ABN , Publish Date - May 26 , 2026 | 12:05 AM
గ్రామస్థాయిలో ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానంగా ఉంటూ సేవలందిస్తున్న వీఆర్‌ఏలకు పేస్కేల్ వేతనం అమ లుచేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌చేశారు.
బెలగాం, మే 25 (ఆంధ్రజ్యోతి): గ్రామస్థాయిలో ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానంగా ఉంటూ సేవలందిస్తున్న వీఆర్‌ఏలకు పేస్కేల్ వేతనం అమ లుచేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌చేశారు. సోమవారం వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా సీఐటీయూ నాయకులు జి.వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో తక్కువ వేతనంతో పనిచేస్తూ ప్రజలకు వీఆర్‌ఏలు సేవలందిస్తున్నారని తెలిపారు. పేస్కేల్ అమలు చేయా లని, అర్హత ఉన్న వీఆర్‌ఏలకు వీఆర్వోలుగా ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్‌చేశారు.