Share News

బడి రుణం తీర్చుకోవడం అభినందనీయం: అశోక్‌

ABN , Publish Date - Jul 21 , 2026 | 11:48 PM

తాము విద్యాభ్యాసం చేసిన పాఠశాల రుణం తీర్చుకునేందుకు పూర్వ విద్యార్థులు కృషి చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు.

బడి రుణం తీర్చుకోవడం అభినందనీయం: అశోక్‌
పూర్వ విద్యార్థులతో ఎమ్మెల్యే అశోక్‌

కవిటి, జూలై 21(ఆంధ్రజ్యోతి): తాము విద్యాభ్యాసం చేసిన పాఠశాల రుణం తీర్చుకునేందుకు పూర్వ విద్యార్థులు కృషి చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు. కవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు నిర్మించిన సైకిల్‌ స్టాండ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1982-83లో పదో తరగతి చదివిన విద్యార్థులంతా కలిసి రూ.1.50 లక్షల వ్యయంతో సైకిల్‌స్టాండ్‌ నిర్మించడం హర్షణీయమన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులంతా నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుని, యోగక్షేమాలను తెలుసుకున్నారు.

Updated Date - Jul 21 , 2026 | 11:48 PM