రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:53 PM
మానసిన అనారోగ్యం, మేథో వైకల్యం తో బాధపడుతున్న రోగు లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు ఆదేశించారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు
శ్రీకాకుళం లీగల్, ఏప్రిల్ 21 (ఆంధ్ర జ్యోతి): మానసిన అనారోగ్యం, మేథో వైకల్యం తో బాధపడుతున్న రోగు లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని సందర్శించి అక్కడ ఉన్న వన్‌స్టాప్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వన్‌స్టాప్ సెంటర్‌లో నమోదవుతున్న కేసుల వివరాలు, రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో ఉన్న మానసిక ఆరోగ్యా కేంద్రాన్ని పరిశీలించి చికిత్స పొందు తున్న రోగులను పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్యం, ఆహార నాణ్యత, పరిసరాల పరిశుభ్రతపై ఆరా తీశారు. రోగుల పట్ల వైద్య సిబ్బంది సేవాదృక్పథంతో ఉండాలని సూచించారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కొరతను గుర్తించి తక్షణం వాటిని సరిచేయాలని సూపరింటెండెంట్ డా.ఎల్.ప్రసన్న కుమార్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో హెచ్‌వోడీ డాక్టర్ వి.పద్మ, టి.అఖిల, డి.విజయలక్ష్మి పాల్గొన్నారు.