అఖండ భారతావని కోసం పటేల్ విశేష కృషి
ABN , Publish Date - Nov 01 , 2026 | 12:06 AM
స్వాతంత్ర్యానంతరం అఖండ భారతావని నిర్మాణం కోసం పోరాడిన మహానుభావుడు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అని రిటైర్డ్ డీఎస్పీ భార్గవనాయుడు అన్నారు. స్థానిక శాంతినగర్ కాలనీ లోని గాంధీ స్మృతి వనంలో స్వాతంత్య్ర సమరయోధుడు పటేల్ 151వ జయంత్యుత్సవం శనివారం నిర్వహించారు.
రిటైర్డ్ డీఎస్పీ భార్గవ నాయుడు
జిల్లా వ్యాప్తంగా సర్దార్ పటేల్ జయంతి వేడుకలు
ఘనంగా ఏక్తా దివస్
పాత శ్రీకాకుళం అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): స్వాతంత్ర్యానంతరం అఖండ భారతావని నిర్మాణం కోసం పోరాడిన మహానుభావుడు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అని రిటైర్డ్ డీఎస్పీ భార్గవనాయుడు అన్నారు. స్థానిక శాంతినగర్ కాలనీ లోని గాంధీ స్మృతి వనంలో స్వాతంత్య్ర సమరయోధుడు పటేల్ 151వ జయంత్యుత్సవం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత అనేక సంస్థానాలను విలీనం చేసేందుకు విశేష కృషి చేసి ఉక్కు మనిషిగా కీర్తిగడించారన్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించడంలో పటేల్ ఎన్నో సాహసోపేతమైన ఉద్యమాలకు నాయకత్వం వహించారన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో విగ్రహ దాత, ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు) రిటైర్డ్ ప్రిన్సిపాల్ జీఎస్ రామారావు, మందిరం ప్రతినిధులు సురంగి మోహనరావు, నక్క శంకరరావు, గుత్తు చిన్నారావు, జి.నాగే శ్వరరావు, ఎంవీవీఎస్ శాస్త్రి, పైడి హరనాథరావు తదితరులు పాల్గొన్నారు.
జూనియర్ కళాశాలలో..
సోంపేట, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా శనివారం ఏక్తాదివస్‌ను నిర్వ హించారు. స్వాతంత్ర్యానంతరం పటేల్ సంస్థానాలను విలీనం చేసేందుకు ఎనలేని కృషి చేశారని వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.మోహనరావు, అధ్యాపకులు పి.రజనీకుమారి, ఎ.రామినాయుడు, ఎం.ప్రసాద్, జి.వెంకటరావు, సంధ్యారాణి, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ..
ఎచ్చెర్ల, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు, స్వాతంత్య్ర సమరయోధుడు, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరిం చుకుని ఎచ్చెర్ల సాయుధ పోలీసు కల్యాణ మండపంలో శనివారం ఏక్తా దివస్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ చేయిం చారు. పోలీసుశాఖ వినియోగించే ఆయుఽధాలు, భద్రతా పరికరాలను ప్రదర్శించి వీటి వినియోగాన్ని రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శంకర్ ప్రసాద్, పోలీసు సిబ్బంది విద్యా ర్థులకు వివరించారు.
వర్సిటీ, ఆర్జీయూకేటీ క్యాంపస్‌లలో..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, ఆర్జీయూకేటీ క్యాంపస్‌లలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని శనివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. స్వాతంత్య్ర సమర ఉద్యమం తరువాత సంస్థానాలను విలీనం చేయడం, దేశాభివృద్ధిలో ఆయన చేసిన సేవలను వక్తలు వివరించారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ, ప్రొఫెసర్ కేఆర్ రజని, రిజిస్ట్రార్ ప్రొఫె సర్ బి.అడ్డయ్య, ఆర్జీయూకేటీ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.గిరిధర్ పాల్గొన్నారు.
ఘనంగా పటేల్ జయంతి
టెక్కలి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి వేడుకలు నిర్వహించారు. నవంబరు 1 నుంచి 7 వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ప్రిన్సిపాల్ గోవిందమ్మ తెలిపారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.