Share News

13 రోజుల వయసులోనే పాస్‌పోర్టు

ABN , Publish Date - Sep 08 , 2026 | 11:41 PM

ఇచ్చాపురం పట్టణానికి చెందిన చిన్నారి అగస్య ప్రిన్సీ అరుదైన రికార్డు సాధించింది. పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్టు భారత ప్రభుత్వం నుంచి పాస్‌పోర్టు పొందింది.

13 రోజుల వయసులోనే పాస్‌పోర్టు
తల్లిదండ్రులతో అగస్య

ఇచ్ఛాపురం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఇచ్చాపురం పట్టణానికి చెందిన చిన్నారి అగస్య ప్రిన్సీ అరుదైన రికార్డు సాధించింది. పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్టు భారత ప్రభుత్వం నుంచి పాస్‌పోర్టు పొందింది. ఇచ్ఛాపురం పట్ట ణానికి చెందిన ఆశీష్‌, గీతా మాధురి ఉద్యోగరీత్యా లండన్‌ లో స్థిరపడ్డారు. వీరికి 2026 లో మే 30న చిన్నారి అగస్య ప్రిన్సీ పుట్టింది. అయితే లండన్‌లో స్థిర నివాసానికి ఆధార్‌ కార్డు తప్పనిసరి. దీంతో చిన్నారి జన్మించిన ఒక రోజు తరువాత అంటే ఈ ఏడాది జూన్‌ 1న పుట్టిన రోజు ధ్రువీకరణపత్రం తీసుకు న్నారు. 2న బాల ఆధార్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. 4న ఆధార్‌ కార్డు మంజూరైంది. 6న పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకు న్నారు. 12న పాస్‌పోర్టు మంజూరైంది. కేవలం 13 రోజుల్లో విదేశాలకు వెళ్లేందుకు వీలుగా పాస్‌పోర్టు మంజూరు కావడం రికార్డని చెబు తున్నారు. అగస్య ప్రిన్సీని యంగెస్ట్‌ పాస్‌పోర్టు హోల్డర్‌గా ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గుర్తించింది.

Updated Date - Sep 08 , 2026 | 11:41 PM