పనులు పూర్తికాక.. ప్రయాణికులకు పాట్లు
ABN , Publish Date - Jan 25 , 2026 | 11:28 PM
:మందస మండలంలోని సాబకోట రోడ్డులో బుడంబో రామ కృష్ణాపురం వద్ద రూ.రెండు లక్షలతో నిర్మిస్తున్న ప్రయాణికుల విశ్రాంతి భవనం అర్ధాంతరంగా నిలిపి వేశారు.
హరిపురం, జనవరి 25(ఆంధ్రజ్యోతి):మందస మండలంలోని సాబకోట రోడ్డులో బుడంబో రామ కృష్ణాపురం వద్ద రూ.రెండు లక్షలతో నిర్మిస్తున్న ప్రయాణికుల విశ్రాంతి భవనం అర్ధాంతరంగా నిలిపి వేశారు. దీంతో భవనం ప్లేట్లు, ఇటుకలు రాలిపడుతున్నాయి. నిర్మాణం ప్రారంభించి మూడేళ్లు దాటినా నేటికీ పూర్తికాకపోవడంతో బుడంబోరామకృష్ణాపురం, బుడంబోకాలనీ, కృష్ణాపురం, సింగపురం తది తరగ్రామాల ప్రయాణికులకు వేచిఉండేందుకు పాట్లు తప్పడంలేదు. గత టీడీపీహయాంలో నిర్మాణం ప్రారంభించగా వైసీపీ అఽధికారంలోకి రావడంతో పనులు నిలిచిపోయాయి. దీంతోపాటు మండలంలో మరో ఆరుచోట్ల విశ్రాంతి భవననిర్మాణాలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. దీనికితోడు మందసలో కనీసం ప్రయాణికులు తలదాచుకునేందుకు విశ్రాంతి భవనం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మండల కేంద్రంలో విశ్రాంతి భవనం మంజూరు చేయడంతోపాటు అర్థాంతరంగా నిలిచిన విశ్రాంతి భవన నిర్మాణం పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు.