పూర్తి హక్కులతో పాస్‌పుస్తకాలు
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:09 AM
రాష్ట్రంలో రైతులందరికీ పూర్తి హక్కులతో పట్టా దారు పాస్ పుస్తకాలను కూటమి ప్రభుత్వం అందజేస్తోందని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
ఎమ్మెల్యే కూన రవికుమార్
పొందూరు, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతులందరికీ పూర్తి హక్కులతో పట్టా దారు పాస్ పుస్తకాలను కూటమి ప్రభుత్వం అందజేస్తోందని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. తండ్యాం, లైదాం గ్రామాల్లో గురువారం పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పొర పాట్ల వల్ల రైతులు సమ స్యలు ఎదుర్కొంటున్నార న్నారు. వాటిని సరిచేసి వివాదాలు లేకుండా పట్టా దారు పుస్తకాలను అందిం చాలని ప్రభుత్వం ఆదేశిం చిందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్.వెంకటేష్, పీఏసీఎస్ అధ్యక్షుడు వండాన మురళి, టీడీపీ మండల అధక్షుడు రాము, నేతలు అన్నెపు రాము, బలగ శంకర భాస్కర్, బాడాన గిరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం లైదాం గ్రామంలో ఇంటింటికీ టీడీపీ నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే రవికుమార్ ప్రజలకు వివరించారు.