Share News

అర్హులైన రైతులకు పాసు పుస్తకాలు

ABN , Publish Date - Jun 04 , 2026 | 11:44 PM

అర్హులైన రైతుకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందజేస్తున్నామని ప్రభుత్వ విప్‌, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తెలిపారు. గురువారం కీర్తిపురం పంచాయతీలో కీర్తిపురం, పాయి తారి పంచాయతీల రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలను అందజేశారు.

అర్హులైన రైతులకు పాసు పుస్తకాలు
పాస్‌ పుస్తకం అందజేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌

ఇచ్ఛాపురం, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి) అర్హులైన రైతుకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందజేస్తున్నామని ప్రభుత్వ విప్‌, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తెలిపారు. గురువారం కీర్తిపురం పంచాయతీలో కీర్తిపురం, పాయి తారి పంచాయతీల రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలను అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాజముద్రతో కాకుండా తప్పులు తడకలతో కూడిన పాస్‌పుస్తకాలు అందజేయడంతో అవి పనికిరాకుండా పోయాయ ని తెలిపారు. కీర్తిపురం, పాయితారి పంచాయతీల్లో 454పాస్‌ పుస్తకాలను పంపిణీ చేశామని, మిగిలిన 64పాస్‌పుస్తకాల ప్రింటింగ్‌లో తప్పులు ఉన్నాయి వాటిని సరిచేసి మరో రెండు మూడురోజుల్లో అధికారులు అందజేస్తారని తెలిపారు. గత ప్రభుత్వం ల్యాండ్‌ టైట్లింగ్‌చట్టం తీసుకురావడంపై విమర్శించారు. జగన్‌ ప్రభుత్వం పాస్‌పుస్త కాలు, సర్వేరాళ్లు పేరిట రూ.600కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎన్‌.వెంకటరావు, ఎంపీడీవో ప్రభాకరరావు, జనసేన ఇన్‌చార్జి దాసరి రాజు, రాష్ట్ర రెడ్డిక కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండా శంకర్‌రెడ్డి, నాయకులు లోపింటి పద్మనాభం, సూర్యనారాయణ, గిన్ని బాలరాజు, పెదిని బాబ్జీ, కామేష్‌, మేరుగు సూర్యనారాయణ, సహదేవ్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 11:44 PM