Share News

స్థానిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం

ABN , Publish Date - Jul 09 , 2026 | 12:07 AM

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం గ్రామ స్థాయి నుంచి చేపట్టా లని ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు, ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు అన్నారు.

స్థానిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం
మాట్లాడుతున్న ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు

నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు వజ్జ బాబూరావు

ఎచ్చెర్ల, జూలై 8(ఆంధ్రజ్యోతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం గ్రామ స్థాయి నుంచి చేపట్టా లని ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు, ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు అన్నారు. అల్లినగరంలో యూనిట్‌ ఇన్‌ఛార్జిలు, బూత్‌ కన్వీ నర్లు, ముఖ్య నాయకులతో బుధవారం సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో విజయానికి పునాది బూత్‌ స్థాయిలోనే ఏర్పడుతుందన్నారు. ప్రస్తు తం జరుగుతున్న ‘సర్‌’ ప్రక్రియను కీలకంగా భావించి, అర్హులైన ప్రతీ ఓటరు జాబితాలో ఉండేలా చూడాలన్నారు. కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, చిరునామా మార్పులు తదితర అంశాలపై బూత్‌స్థాయిలో పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో క్లస్టర్‌ ఇన్‌చార్జి, కళింగ కార్పొ రేషన్‌ డైరెక్టర్‌ అన్నెపు భువనేశ్వరరావు, కూటమి నేతలు మాడుగుల వెంకటరావు, గట్టెం శివ రామ్‌, గుంటుకు సంతోష్‌ కుమార్‌, షేక్‌ అబ్దు ల్లా, ఉరిటి సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2026 | 12:07 AM