కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలి
ABN , Publish Date - Sep 27 , 2026 | 11:58 PM
రెండున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేయాలని కోరారు. ఆదివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన స్థానికసంస్థల ఎన్నికలనేపథ్యంలో పార్టీశ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. అనంతరం ప్రజాదర్భార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్ర మంలో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివర ప్రసాద్, అప్పారావు, రామకృష్ణ, సింహాచలం పాల్గొన్నారు.
కోటబొమ్మాళి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): రెండున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేయాలని కోరారు. ఆదివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన స్థానికసంస్థల ఎన్నికలనేపథ్యంలో పార్టీశ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. అనంతరం ప్రజాదర్భార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్ర మంలో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివర ప్రసాద్, అప్పారావు, రామకృష్ణ, సింహాచలం పాల్గొన్నారు.
కనకదుర్గ బ్రహ్మోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ
పార్వతీపురంలో సర్వమంగళదేవి పీఠం ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు పురస్కరిం చుకొని కనకదుర్గ బ్రహ్మోత్సవాల నిర్వహణకు గోడపత్రికను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. నాడీ జ్యోతిష్కులు బ్రహ్మశ్రీ మురుపాక కాళిదాస్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలకు మంత్రికి ఆహ్వానం పలికారు. కార్యక్ర మంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు అట్టాడ రాంప్రసాద్, బెనర్జీ పాల్గొన్నారు.
ఫటెక్కలి రూరల్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): టెక్కలి నియోజకవర్గం రూపు రేఖలు మార్చి చూపుతానని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆదివారం అయోధ్య పురం బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎం.కృష్ణ మూర్తి, ఏఎంసీ చెర్మన్ బగాది శేషగిరిరావు, పోలాకి షణ్మఖరావు, పినకాన అజయ్‌కు మార్, మట్ట పురుషోత్తం, రాము, సూర్యనారాయణ పాల్గొన్నారు.