Share News

విద్యతోపాటు క్రీడల్లోనూ భాగస్వామ్యం కావాలి

ABN , Publish Date - May 24 , 2026 | 11:53 PM

విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లోనూ భాగస్వామ్యం కావాలని ఎస్పీకేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. స్థానిక ఆర్ట్స్‌ కళాశాల మైదానం ఆవరణలో నూతనంగా నిర్మించిన క్రికెట్‌ నెట్స్‌ను ఆదివారం ప్రారంభించారు.

 విద్యతోపాటు క్రీడల్లోనూ భాగస్వామ్యం కావాలి
క్రికెట్‌ నెట్స్‌ను ప్రారంభిస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

ఆర్ట్స్‌ కళాశాల క్రీడా మైదానంలో క్రికెట్‌ నెట్స్‌ ప్రారంభం

శ్రీకాకుళం స్పోర్ట్స్‌, మే 24 (ఆంధ్ర జ్యోతి): విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లోనూ భాగస్వామ్యం కావాలని ఎస్పీకేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. స్థానిక ఆర్ట్స్‌ కళాశాల మైదానం ఆవరణలో నూతనంగా నిర్మించిన క్రికెట్‌ నెట్స్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లా డుతూ.. క్రీడలను హాబీగా చేసుకోవాలని, అందులో రాణించినట్టయితే మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు. జిల్లా క్రికెట్‌ అసోసి యేషన్‌ అధ్యక్షుడు, ఆమదావలస ఎమ్మె ల్యే కూన రవికుమార్‌ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పిల్లల ఇష్టాలను గుర్తించి క్రీడల్లోనూ ప్రోత్సహించా లన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ స్పోర్ట్స్‌ కోటాలో ఉన్న రెండు శాతం ఉన్న రిజర్వేషన్‌ మూడు శాతానికి పెంచిందన్నారు. జిల్లాలో క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి సాయశక్తులా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వై.పోలినాయుడు, క్రికెట్‌ సంఘం ప్రతినిధులు హసన్‌ రాజా, నగిరి బెనర్జీ, శైలానీ, బాలరమురళి, ఇలియాస్‌ మహ్మద్‌, సువ్వారి రవికుమార్‌, సుంకరి కృష్ణ, శిక్షకుడు సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2026 | 11:53 PM