Share News

నీటి సంరక్షణలో భాగస్వాములుకండి

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:08 AM

గ్రామాల్లో నీటిని సంరక్షించడంలో ప్రతిఒక్కరూ భాగస్వా ములు కావాలని పలువురు ప్రజా ప్రతినిధులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమాన్ని సోమవారం జిల్లాలో పలు ప్రాంతాల్లో నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొని కార్యక్రమ లక్ష్యాలను వివరించారు.

నీటి సంరక్షణలో భాగస్వాములుకండి
బూర్జ: భూమిని గునపంతో తవ్వి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్‌

గ్రామాల్లో నీటిని సంరక్షించడంలో ప్రతిఒక్కరూ భాగస్వా ములు కావాలని పలువురు ప్రజా ప్రతినిధులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమాన్ని సోమవారం జిల్లాలో పలు ప్రాంతాల్లో నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొని కార్యక్రమ లక్ష్యాలను వివరించారు. ఆ వివరాలిలా..

ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టాలి: రవికుమార్‌

బూర్జ, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ప్రతి నీటిబొట్టునూ ఒడిసి పట్టాలని, తద్వారా రైతన్నలకు మేలు చేకూర్చా లని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. కాళపర్తి పంచాయతీలో ‘నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగు, తాగునీటి కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. కార్యక్రమం లో మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ ఆనెపు రామకృష్ణ, వైస్‌ ఎంపీపీ బి.సూర్యారావు, సొసైటీ చైర్మన్‌ శ్రీరామ్మూర్తి, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌, టీడీపీ మండల అధ్యక్షుడు రాంజీ, టీడీపీ నాయకు రాలు తమ్మినేని సుజాత, తహసీల్దార్‌ పద్మావతి, వ్యవసా యాధికారి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

100 రోజుల జలయజ్ఞం: శంకర్‌

శ్రీకాకుళం రూరల్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో 100 రోజుల పాటు జల యజ్ఞం చేపట్టను న్నామని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రక టించిన నీటి భద్రత- సాగు నీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమాన్ని సోమవా రం రూరల్‌ మండలం సానివాడ గ్రామంలో ప్రారంభించా రు. గ్రామాల్లోని చెరువులను పునరు ద్ధరించడం, ప్రతిబొట్టు నీటిని సంర క్షించడం, భూగర్భ జలాలను పెంచుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ మన్నారు. ఇందులో రైతులు పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నీటి సంఘాల నాయకులు, అఽధికారులు, కూటమి నేతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

భూగర్భ జలాలను కాపాడుకోవాలి: బగ్గు

పోలాకి, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): భూగర్భ జలాలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి అన్నారు. సోమవారం పిరువాడలో నీటిభద్రత- సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని ప్రారంభించారు. వంద రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించిందన్నారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి ప్రసాదరావు, ఏపీడీ కె.లోకేష్‌, ఏపీవో రమణ, తహసీల్దార్‌ శ్రీనివాసరావు, ఎంపీడీవో గరిమెళ్ల రవికుమార్‌,వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు వెంటకఅప్పలనాయుడు, శిమ్మచంద్రశేఖర్‌, పీఏసీఎస్‌ అధ్యక్షులు బైరి భాస్కరరావు, వైవీవలస నీటిసంఘం అధ్యక్షుడు మెండ మోహనరావు, మెండ శ్రీనివాసరావు, దంతసింహాచలం, రోణంకి కృష్ణంనాయుడు పాల్గొన్నారు.

నీటి సమస్యల పరిష్కారం ధ్యేయం: ఎంపీ, ఎమ్మెల్యే

రణస్థలం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అని ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. నీటి భద్రత 100 రోజుల కార్యక్రమాన్ని సోమవారం బంటుపల్లి గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో నీటి సమస్యలను పరిష్కరించడం, రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, రైతులు, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2026 | 12:08 AM