Share News

హక్కుల సాధన ఉద్యమంలో భాగస్వామ్యంకండి

ABN , Publish Date - Jul 04 , 2026 | 11:47 PM

హక్కుల సాధనకు ఈనెల 12న ‘ఐక్యమే బలం-హక్కుల సాధనే లక్ష్యం’ నినాదంతో ఈనెల 12న శ్రీకాకుళంలో నిర్వహించనున్న ఉద్యమ సన్నద్ధం సభలో ప్రతీ ఉద్యో గి భాగస్వామ్యమై విజయ వంతం చేయాలని ఏపీజేఏసీ జిల్లా చైర్మన్‌ బీవీవీఎన్‌ రాజు కోరారు.

హక్కుల సాధన ఉద్యమంలో భాగస్వామ్యంకండి
మాట్లాడుతున్న ఏపీజేఏసీ జిల్లా చైర్మన్‌ బీవీవీఎన్‌ రాజు

ఏపీజేఏసీ జిల్లా చైౖర్మన్‌ బీవీవీఎన్‌ రాజు

అరసవల్లి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): హక్కుల సాధనకు ఈనెల 12న ‘ఐక్యమే బలం-హక్కుల సాధనే లక్ష్యం’ నినాదంతో ఈనెల 12న శ్రీకాకుళంలో నిర్వహించనున్న ఉద్యమ సన్నద్ధం సభలో ప్రతీ ఉద్యో గి భాగస్వామ్యమై విజయ వంతం చేయాలని ఏపీజేఏసీ జిల్లా చైర్మన్‌ బీవీవీఎన్‌ రాజు కోరారు. ఈ మేరకు స్థానిక రెవెన్యూ గెస్ట్‌హౌస్‌లో స్వర్ణగ్రామం- స్వర్ణవార్డు సచివాలయ ఉద్యోగులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, హక్కుల సాధనకు ఐక్య పోరాటాలే మార్గమ న్నారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీల సంఘం జిల్లా కార్యదర్శి జి.తిరుమల రావు, వీఆర్వోల సంఘం జిల్లా కోశాధికారి జి.ఢిల్లేశ్వర రావు, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్ల సంఘం అధ్య క్షుడు కె.సూర్యభరత్‌, రాష్ట్ర కార్యదర్శి ఫరూఖ్‌, అర్బన్‌ వెల్ఫేర్‌, ఎడ్యుకేషన్‌ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌, టౌన్‌ ప్లానింగ్‌ సెక్రటరీల సంఘం జిల్లా అధ్యక్షుడు రవికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2026 | 11:47 PM