అవినీతి రహిత సమాజ నిర్మాణంలో భాగస్వామ్యంకండి
ABN , Publish Date - Oct 29 , 2026 | 12:17 AM
వినీతి రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని ఏసీబీ డీఎస్పీ కె.సత్య నారాయణ రావు కోరారు.
ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణరావు
శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): అవినీతి రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని ఏసీబీ డీఎస్పీ కె.సత్య నారాయణ రావు కోరారు. విజిలెన్స్ అవగాహనా వారోత్సవాల్లో భాగంగా బుధవారం అఫీషియల్ కాలనీలోని గిరిజన బాలుర వసతిగృహాన్ని సంద ర్శించి విద్యార్థులతో మాట్లాడారు. సమాజంలో అవినీతిని రూపు మాపడంలో యువత పాత్ర అత్యంత కీలకమని, ప్రభుత్వ కార్యాల యాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెనుకాడకుండా ఏసీబీని ఆశ్రయించవచ్చన్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్నామన్నారు. అనంతరం అవినీతి వ్యతి రేక ప్రచార పోసర్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏసీబీ సీఐలు ఎస్‌వీ రమణ, కె.భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు.