Share News

పార్కింగ్‌కు స్థలాలు లేక ట్రాఫిక్‌ పాట్లు

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:52 PM

నరసన్నపేట పట్టణంలో పార్కింగ్‌కు స్థలాలు లేకపోవడంతో ట్రాఫిక్‌ సమస్య వేధిస్తోంది. దీనికి తోడు పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్లు విస్తరించకపోవడంతో ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు వాహనచోదకులు అగచాట్లకు గురవుతున్నారు. 84 వీధుల్లో 30 వేలమంది జనాభాతోపాటు 1200 వాణిజ్యసముదాయాలు ఇక్కడ ఉన్నా యి

పార్కింగ్‌కు స్థలాలు లేక ట్రాఫిక్‌ పాట్లు
కాలేజీ రోడ్డులో స్తంభించిన ట్రాఫిక్‌ :

నరసన్నపేట, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): నరసన్నపేట పట్టణంలో పార్కింగ్‌కు స్థలాలు లేకపోవడంతో ట్రాఫిక్‌ సమస్య వేధిస్తోంది. దీనికి తోడు పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్లు విస్తరించకపోవడంతో ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు వాహనచోదకులు అగచాట్లకు గురవుతున్నారు. 84 వీధుల్లో 30 వేలమంది జనాభాతోపాటు 1200 వాణిజ్యసముదాయాలు ఇక్కడ ఉన్నా యి. చుట్టుపక్కల మండలాల నుంచి ప్రతిరోజూ 20 వేల మంది వరకూ వివిధ పనుల నిమిత్తం నరసన్నపేట వస్తుంటారు. ఒడిశాలోని పలు ప్రాంతాలకు వెళ్లే కూడలికావడంతోపాటు జిల్లాలో వాణిజ్యపరంగా కీల కంగా ఉండే పట్టణం కావడంతో నిత్యం రద్దీగా ఉంటోంది. ఈనేపథ్యం లో ఇక్కడి పోలీసుస్టేషన్‌లో 29 మంది సిబ్బందికి గాను 15 మంది డిప్యు టేషన్‌పై ఉన్నారు. వీరిలో ఒకరు మాత్రమే పట్టణంలో ట్రాఫిక్‌ క్రమబద్దీ కరిస్తున్నారు. రోడ్డుపై వాహనాలు నిలిపివేస్తుండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పలుబ్యాంకులు, కల్యాణమండపాలు, వాణిజ్య సముదాయాలు, దుకాణాలకు ఎటువంటి పార్కింగ్‌ ప్రదేశాలు లేకపోవడంతో ద్విచక్రవాహనాలు రోడ్డుపైనే పార్కింగ్‌ చేయాల్సి వస్తుండడంతో ట్రాపిక్‌ సమస్య ఏర్పడుతోంది. ప్రస్తుతం పండగ సీజన్‌ కావడంతో దుస్తులు, నిత్యావసరసరుకుల కొనుగోలుకు చుట్టుపక్కల మండలాల నుంచి వేలాది మంది వస్తుండడంతో రోడ్లన్నీ కిటకిట లాడుతున్నాయి. పట్టణంలో దాదాపు 20 వాణిజ్యబ్యాంకులు, 14 ఫంక్షన్‌ హాళ్లు, 100కు పైగా హోటళ్లు, టిఫిన్‌ దుకాణాలు ఉండగా వాటిలో ఏ ఒక్కటిచోట సరైన పార్కింగ్‌లు లేవు. నిబంధనల ప్రకారం వాణిజంమ భవనాల హద్దు కొలతలతో 30శాతం, బహుళ గృహ సముదాయాల్లో 25 శాతం పార్కింగ్‌కు ఖాళీస్థలం కేటాయించాలి. ఏఒక్కరూ ఈనిబంధన పాటించడంలేదు.దీనికితోడు ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక పోలీసు స్టేషన్‌ లేదు. పోలీసుస్టేషన్‌లో సిబ్బంది కొరత వల్ల ట్రాఫిక్‌ నియంత్ర ణపై పర్యవేక్షణ లేకుండా పోయింది.పల్లిపేట జంక్షన్‌ నుంచి వెంకటేశ్వర మహాల్‌ వరకు మెయిన్‌ రోడ్డుపై వస్త్రదుకాణాలు ఎక్కువగా ఉండ డంతోపాటు రోడ్డుపైనే వాహనాలు నిలిపివేయడం వల్ల ప్రస్తుతం సంక్రాంతి కావడంతో నడిచివెళ్లడానికి కూడా వీల్లేకుండా పోయిందని పలువురు వాపోతున్నారు. కాగా ట్రాఫిక్‌ క్రమబద్దీకరణకు చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - Jan 06 , 2026 | 11:52 PM