పోస్టల్ శాఖ ద్వారా ఇతర దేశాలకు పార్సిల్ సేవలు
ABN , Publish Date - Aug 19 , 2026 | 12:19 AM
పోస్టల్ శాఖ ద్వారా ఇతర దేశాలకు పార్సిల్ సేవలను అందించనున్నట్లు సూపరింటెండెంట్ వండాన హరిబాబు చెప్పారు.
హిరమండలం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): పోస్టల్ శాఖ ద్వారా ఇతర దేశాలకు పార్సిల్ సేవలను అందించనున్నట్లు సూపరింటెండెంట్ వండాన హరిబాబు చెప్పారు. మంగళ వారం ఆయన హిరమండలం పోస్టల్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తినుబండారాలు, గిరిజన ఉత్పత్తులు ఇతర దేశాలకు పార్సిల్ ద్వారా పంపిం చేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. దీని కోసం జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసులో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.