Share News

పంచాయతీ కార్యదర్శి ఇంట్లో చోరీ

ABN , Publish Date - Jan 18 , 2026 | 12:30 AM

గోవిందపురం పంచాయతీ కార్యదర్శి శరత్‌చంద్ర ఇంట్లో చోరీ జరిగింది. పోలీసు లు, బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. నందిగాం మండలం బోరుభద్రకు చెందిన శరత్‌చంద్ర గోవిందపురంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ పూండి- గోవిందపురం సాయిరాం కాలనీలో కుటుం బంతో కలిసి నివాసం ఉంటున్నాడు.

పంచాయతీ కార్యదర్శి ఇంట్లో చోరీ

  • 75 తులాలు వెండి, ఐదున్నర తులాల బంగారం, రూ.90వేలు అపహరణ

వజ్రపుకొత్తూరు, జనవరి 17(ఆంధ్రజ్యోతి): గోవిందపురం పంచాయతీ కార్యదర్శి శరత్‌చంద్ర ఇంట్లో చోరీ జరిగింది. పోలీసు లు, బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. నందిగాం మండలం బోరుభద్రకు చెందిన శరత్‌చంద్ర గోవిందపురంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ పూండి- గోవిందపురం సాయిరాం కాలనీలో కుటుం బంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే సంక్రాంతి సెలవులు కావడంతో ఇంటికి తాళం వేసి భోగికి ముందురోజు స్వగ్రామా నికి కుటుంబంతో కలసి వెళ్లారు. తిరిగి శనివారం గోవిదంపురం సచివాలయంలో వి ధులకు హాజరయ్యారు. ఈ క్రమంలో సా యంత్రం తాను నివాసం ఉంటున్న సాయి రాం కాలనీలో ఉన్న ఇంటికి వచ్చి తలుపులు తీసి చూడగా.. దొంగతనం జరిగినట్టు గుర్తిం చారు. బీరువాలో ఉన్న 75 తులాలు వెండి, ఐదన్నర తులాల బంగారం వస్తువులతో పాటు రూ.90 వేలు చోరీ జరిగినట్టు గుర్తిం చారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పరిశీలించారు. శుక్రవారం రాత్రే దొంగతనం జరిగి ఉం టుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ బి.నిహార్‌ తెలిపారు.

Updated Date - Jan 18 , 2026 | 12:30 AM