Share News

పంచాయతీ ఆదాయం పెంచుకోవాలి

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:04 AM

ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని పంచాయతీకి ఆదాయం పెంచుకోవాలని ఇన్‌చార్జి జిల్లా పంచా యతీ అధికారి గోపిబాల సూచించారు.

పంచాయతీ ఆదాయం పెంచుకోవాలి
వేలంపాట నిర్వహిస్తున్న అధికారులు :

పొందూరు, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని పంచాయతీకి ఆదాయం పెంచుకోవాలని ఇన్‌చార్జి జిల్లా పంచా యతీ అధికారి గోపిబాల సూచించారు. గురువారం పొందూరులో నిర్వ హించిన వేలంపాటలో ఆయన మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే ఆదాయం పెంచుకోవాల్సిందేనన్నారు. సర్కారుపాట కంటే తక్కువగా రావడంతో వేలంపాటను శుక్రవారానికి వాయిదావేశారు. మార్కెట్‌ ఆశీలపాటను సర్కారు రూ.11లక్షల70 వేలుగా నిర్ణయించగా ఎక్కువగా రూ. 11,10,000కు వేలంపాటదారులు కోడ్‌ చేయడంతో డీపీవో తాత్కాలికంగా వాయిదా వేశారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు సీహెచ్‌ రామ్మోహన్‌, ఈవోఆర్డీ సింహాచలం, ఈవో పి.జగదీష్‌ పాల్గొన్నారు.

నిధుల దుర్వినియోగంపై నివేదిక: డీఎల్‌పీవో

కవిటి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): సీహెచ్‌ కపాసుకుద్ది పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై పూర్తి వివరాలతో నివేదికను జిల్లా పంచాయతీ అధికారికి అందజేస్తామని డీఎల్‌పీవో ఐవీ రమణ తెలిపారు. సీహెచ్‌ కపాసుకుద్ది పంచాయతీలో నిధులు దుర్వినియోగమయ్యాయని కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం డీఎల్‌పీవో ఐవీ రమణ విచారణ నిర్వహించారు. గ్రామంలో ఫిర్యాదుదారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. పంచాయతీ రికార్డులను పరిశీలించి, వివరాలను నమోదు చేసుకున్నారు.

Updated Date - Mar 13 , 2026 | 12:04 AM