పుణ్యక్షేత్రంగా ‘పంచథామం’
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:26 AM
మున్ముందు ప్రముఖ పుణ్యక్షేత్రా ల్లో ఒకటిగా పంచథామ క్షేత్రం పేరొందుతుందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు
కోటబొమ్మాళి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): మున్ముందు ప్రముఖ పుణ్యక్షేత్రా ల్లో ఒకటిగా పంచథామ క్షేత్రం పేరొందుతుందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం చిన్న హరిశ్చంద్రపురంలో వెలసిన పంచథామ క్షేత్రాన్ని ఆయన సందర్శించి.. స్పటిక, వాయి, జల లింగంతోపాటు రామసేతువులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్షేత్రంలో సాక్షాత్తు శివుడే ఉన్నారన్నట్టుగా ఎక్కడా చూసిన శివలింగాలు, దేవతాముర్థుల విగ్రహాలు కనిపిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.
ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపిస్తా..
టెక్కలి, కోటబొమ్మాళి, నరసన్నపేట, జలుమూరు, సారవకోట మండలాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉన్న హరిశ్చంద్రపురం రైలు నిలయంలో ఎక్స్ ప్రెస్ రైళ్లు అపిస్తానని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఆదివారం హరిశ్చంద్రపురంలోని గ్రామస్థులతో మాట్లాడుతూ.. బాబాయ్, రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపేందుకు చర్యలు తీసుకోవాలని గట్టిగా చెప్పారని, దీనికోసం ఇప్పటికే కేంద్ర రైల్వేమంత్రితో మాట్లాడానని, ఆ యన కూడా సానుకూలంగా ఉన్నారన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కింజరాపు హరివరప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ వెలమల కామేశ్వరరావు, ఆలయ ధర్మకర్త ఉప్పాడ కనకరాజు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆలయ అభివృద్ధికి కృషి
టెక్కలి రూరల్, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): రావివలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయం అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మో హన్‌నాయుడు అన్నారు. ఆదివారం సాయంత్రం మల్లికార్జున స్వామిని కలెక్టర్ స్వప్నిల్ వినకర్ పుండ్కర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంఖర్ తో కలిసి దర్శిం చుకున్నారు. రావివలసను మహా పుణ్యక్షేంత్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాన న్నారు. టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, టీడీపీ నాయకులు హరిప్రసాద్, బి.గోవిందరాజులు, బగాధి శేషగిరావు, ఎల్‌ఎల్ నాయుడు ఉన్నారు.
వైభవ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో..
టెక్కలి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): స్థానిక పట్టుమహాదేవి కోనేరు గట్టుపై గల వైభవ వేంకటేశ్వర స్వామిని ఆదివారం రాత్రి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, టీడీపీ నాయకులు కింజరాపు హరివరప్రసాద్, అరవల రవీంద్ర, బగాది శేషగిరి, దల్లి ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.