‘పలాస-కాశీబుగ్గ’ను టాప్‌టెన్ మునిసిపాలిటీల్లో ఒకటిగా చేయాలి
ABN , Publish Date - Nov 06 , 2026 | 12:25 AM
పలాస-కాశీబుగ్గను రాష్ట్రంలోనే టాప్‌టెన్ మునిసిపాలిటీల్లో ఒకటిగా చేయాలన్నదే తమ అభిలాష అని పలాస ఎమ్యెల్యే గౌతు శిరీష తెలిపారు. ఈమేరకు ఎమ్మెల్యే గౌతు శిరీష, వెంకన్నచౌదరి, మాజీ మంత్రి గౌతు శివాజీ, విజయలక్ష్మి దంపతులను గురువారం మునిసిపల్ చైర్‌పర్సన్‌గా గెలుపొందిన వజ్జ గంగాభవాని కలుసుకున్నారు. కృషి, పలాసకు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్లే మునిసిపాలిటీలో అఖండ విజయం సాధించామని వజ్జ గంగాభవాని తెలిపారు.
పలాస, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గను రాష్ట్రంలోనే టాప్‌టెన్ మునిసిపాలిటీల్లో ఒకటిగా చేయాలన్నదే తమ అభిలాష అని పలాస ఎమ్యెల్యే గౌతు శిరీష తెలిపారు. ఈమేరకు ఎమ్మెల్యే గౌతు శిరీష, వెంకన్నచౌదరి, మాజీ మంత్రి గౌతు శివాజీ, విజయలక్ష్మి దంపతులను గురువారం మునిసిపల్ చైర్‌పర్సన్‌గా గెలుపొందిన వజ్జ గంగాభవాని కలుసుకున్నారు. కృషి, పలాసకు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్లే మునిసిపాలిటీలో అఖండ విజయం సాధించామని వజ్జ గంగాభవాని తెలిపారు. ఎమ్యెల్యే చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపించాయని చెప్పారు. రెండున్నరేళ్ల కూటమి పాలనలో ప్రజలు సంక్షేమం, అభివృద్ధి ప్రత్యక్షంగా చూశారని, పలాసలో వైసీపీ హయాంలో అరాచకాన్ని, అన్యాయాన్ని చూశారని, దాని నుంచి పూర్తిగా బయట పడే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.
ఇచ్ఛాపురం మునిసిపల్ చైర్‌పర్సన్‌కు అభినందన
ఇచ్ఛాపురం, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల్లో చైర్ పర్సన్‌గా ఆశిలీలారాణి గెలుపొందడంతో కమిషనర్ ఎన్.రమేష్‌తో పాటు సిబ్బంది ఆమె నివాసంలో కలిశారు. ఈసందర్భంగా అభినందించారు.