‘పలాస’ను కరువు ప్రాంతంగా ప్రకటించాలి
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:06 AM
పలాస నియోజకవర్గం పరిధిలోని పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని రైతులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారని రైతాంగ సమస్యల సాధన కమిటీ అధ్యక్షులు మామిడి మాధవరావు తెలిపారు.
హరిపురం, ఆగష్టు8 (ఆంధ్రజ్యోతి): పలాస నియోజకవర్గం పరిధిలోని పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని రైతులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారని రైతాంగ సమస్యల సాధన కమిటీ అధ్యక్షులు మామిడి మాధవరావు తెలిపారు. ఎల్‌నిలో ప్రభావంతో ప్రజాప్రతినిధు లు స్పందించి కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. శనివారం మందస మండలం హరిపురంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ ఆగస్టు వచ్చినా చెరువులు, కాలువల్లో కనీసం నీరు చేరలేదని తెలి పారు. ఎండలతో విత్తనాలు మొలకెత్తక, మొలిసినవి ఎండిపోయి నారులేక పొలాలు బీడులుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఆరుతడి పంటలు వేసేందు కు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందించి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు దాసరి శ్రీరాములు, త్రిలోచనరావు, మార్పు మన్మథరావు, దర్మాపు వెంకటరావు, వాసు, గణపతి, హేమరావు చౌదరి, రామారావు పాల్గొన్నారు.