Share News

పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఏ-గ్రేడ్‌

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:18 AM

విద్యా ప్రమా ణాలు, నిర్వహ ణ విధానాలు ఉత్తమంగా ఉండడంతో స్థానిక ప్రభు త్వ డిగ్రీ కళాశాలకు ఏ-గ్రేడ్‌ గుర్తింపు లభించింది.

పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఏ-గ్రేడ్‌
బోధనా పరికరాలు పరిశీలిస్తున్న లెక్చరర్ల బృందం

పలాస, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): విద్యా ప్రమా ణాలు, నిర్వహ ణ విధానాలు ఉత్తమంగా ఉండడంతో స్థానిక ప్రభు త్వ డిగ్రీ కళాశాలకు ఏ-గ్రేడ్‌ గుర్తింపు లభించింది. గురువారం అకడమిక్‌ ఆడిట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. అడ్వైజర్స్‌గా ఎం.శాంతిహోమ్‌ (ఇంగ్లీషు లెక్చరర్‌, నరసన్నపేట), డాక్టర్‌ బి.వేణుగోపాలరావు(ఇంగ్లీషు లెక్చరర్‌, రాజాం)తో కూడిక బృందం డిగ్రీ కళాశాలలో ఆడిట్‌ నిర్వహించారు. కళాశాల ప్రమాణాలు, బోధన, రికార్డులు, అకడమిక్‌ పనితీరు పరిశీలించారు. అనంతరం కళాశాలకు ఏ-గ్రేడ్‌ గుర్తింపు అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ జె.వెంకటలక్ష్మి మాట్లాడుతూ కళాశాలలో నాణ్యమైన విద్యతోపాటు అత్యుత్తమ ప్రమాణాలతో బోధన జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు పి.వెంకటరమణ, మధు, శ్రీనివాస్‌ పట్నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 12:18 AM