కేంద్ర, రాష్ట్ర నిధులతో పలాస అభివృద్ధి
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:35 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పలాస నియోజకవర్గం అభి వృద్ధి చేస్తానని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మో హన్‌నాయుడు అన్నారు.
కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
పలాస, మార్చి 20(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పలాస నియోజకవర్గం అభి వృద్ధి చేస్తానని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మో హన్‌నాయుడు అన్నారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్త ల సమావేశం పలాస నియోజకవర్గం సమన్వ యకర్త యార్లగడ్డ వెంకన్నచౌదిరి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్నారు. కాశీబుగ్గ, తాళభద్ర లెవిల్ క్రాస్ గేట్లు వద్ద బ్రిడ్జిల నిర్మాణానికి రైల్వేశాఖ నిధులు వెచ్చిస్తుందన్నారు. జంట పట్టణాల ప్రధాన ర హదారి విస్తరణకు ప్రజలు సహకరించాలని కోరారు. సా గరమాల పథకం ద్వారా 100 కు పైగా మత్స్యకార గ్రామా ల్లో 1600 సోలార్ లైట్లు, బీచ్‌రోడ్ నిర్మాణం చేశామన్నా రు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార ఆధు నికీకరణ ద్వారా పలాస, ఇచ్ఛాపురం నియోజక వర్గాలకు సాగునీరు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పలాసలో పారిశ్రా మిక పార్కులో రహదారులు, మౌలిక సదుపా యాలు కల్పించి యువ పారిశ్రామికవేత్తలు వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామ న్నారు. కార్యక్రమంలో వజ్జ బాబూరావు, లొడగల కామేశ్వరరావు యాదవ్, పీరుకట్ల విఠల్‌రావు, గురిటి సూర్యనారాయణ, గాలి కృష్ణారావు, టంకాల రవిశంకర్ గుప్తా, బడ్డ నాగరాజు, ఎం.నరేంద్ర, సప్ప నవీన్, జోగ మల్లి తదితరులు పాల్గొన్నారు.