Share News

సమస్యల సాధనకు విజయవాడలో పాదయాత్ర

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:15 AM

సమస్యల పరిష్కారం కోసం మే 15న విజయవాడలో పాదయాత్ర చేపడుతు న్నటు సమగ్రశిక్షా కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌, జెఏసీ రాష్ట్ర చైర్మన్‌ బి.కాంతారావు తెలిపారు.

సమస్యల సాధనకు విజయవాడలో పాదయాత్ర
పాదయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్నసమగ్రశిక్షా ఉద్యోగుల జేఏసీ నాయకులు

అరసవల్లి, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారం కోసం మే 15న విజయవాడలో పాదయాత్ర చేపడుతు న్నటు సమగ్రశిక్షా కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌, జెఏసీ రాష్ట్ర చైర్మన్‌ బి.కాంతారావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం స్థానిక బాలభవన్‌లో జేఏసీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ...ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మినిమం టైమ్‌ స్కేల్‌, వేతనాల పెంపు, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ, గ్రాట్యుటీ, 62 ఏళ్లకు ఉద్యోగ విరమణ వయసు పెంచాలని కోరారు. ఈ సందర్భంగా పాదయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు ఎల్‌వీ రమణ, జేఏసీ జిల్లా ఉపాఽధ్యక్షుడు లోకేష్‌, కార్యదర్శి ఉమా పతి,గోవిందరావు, అప్పారావు, జనార్దరావు, ధనుంజయరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2026 | 12:15 AM