Share News

పేదరిక నిర్మూలనకు పీ-4 పథకం

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:31 AM

Tribute to the pioneers దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన పీ-4 పథకం పేదరిక నిర్మూలనకు దిక్సూచిగా మారిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. పీ-4 కార్యక్రమం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం శ్రీకాకుళంలోని బీఆర్‌ అంబేద్కర్‌ ఆడిటోరియంలో మార్గదర్శకులకు సత్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

పేదరిక నిర్మూలనకు పీ-4 పథకం
మార్గదర్శిని సన్మానిస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

8,670 మార్గదర్శకులు... 51వేల కుటుంబాల దత్తత

జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

అరసవల్లి, మార్చి 30(ఆంధ్రజ్యోతి) ః దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన పీ-4 పథకం పేదరిక నిర్మూలనకు దిక్సూచిగా మారిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. పీ-4 కార్యక్రమం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం శ్రీకాకుళంలోని బీఆర్‌ అంబేద్కర్‌ ఆడిటోరియంలో మార్గదర్శకులకు సత్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్‌ మాట్లాడుతూ సమాజంలోని సంపన్నులు అత్యంత పేదరికంలో ఉన్న బంగారు కుటుంబాల అభివృద్ధికి తోడ్పాటు అందించడం ఒక గొప్ప సామాజిక బాధ్యత అని కొనియాడారు.

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 8760 మంది మార్గదర్శకులు 51,353 కుటుంబాలను దత్తత తీసుకున్నారని తెలిపారు. పాతపట్నం నియోజకవర్గం 72.35 శాతం దత్తతతో జిల్లాలోనే ప్రథమంగా నిలిచిందన్నారు. జిల్లాలో 122 గ్రామాల్లో రూ.569.43లక్షలతో సోలార్‌ వీధి దీపాలు, రూ.392లక్షలతో అదనపు తరగతి గదులు, డిజిటల్‌ లైబ్రరీలు, రూ.204.77లక్షలతో డయాలసిస్‌ యూనిట్లు వంటి వైద్య సదుపాయాలు, ఏవియేషన్‌ స్కిల్‌ సెంటర్‌ కోసం రూ.459.63లక్షలు ఖర్చు చేశామన్నారు.

ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ పీ-4 కార్యక్రమం పేదరిక నిర్మూలనకు ఒక శక్తివంతమైన ఆయుధంగా మారిందన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో దాదాపు 62.31శాతం దత్తత ప్రక్రియ పూర్తయ్యిందని, ఇది మార్గదర్శుల సేవానిరతికి నిదర్శమని అన్నారు. ఇంకా దత్తత తీసుకోవాల్సిన కుటుంబాలకు త్వరలోనే మార్గదర్శులను అనుసంధానం చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్వో విశ్వేశ్వరరావు, సీపీఓ లక్ష్మీప్రసన్న, ప్రత్యేకాధికారి శ్రీధర్‌, వివిధ సేవాసంస్థల ప్రతినిథులు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 12:31 AM