Share News

పుట్టెడు శోకంతో...

ABN , Publish Date - Aug 08 , 2026 | 12:15 AM

రో డ్డు ప్రమాదంలో మృతి చెందిన హిందీ ఉపా ధ్యాయుడు దాసరి చంద్రశేఖర్‌ అం త్యక్రియలు డొంక లూరు శ్మశాన వా టికలో శుక్రవారం నిర్వహించారు.

పుట్టెడు శోకంతో...
చంద్రశేఖర్‌కు అంత్యక్రియలు నిర్వహిస్తున్న భార్య వనితాకుమారి

సోంపేట రూర ల్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): రో డ్డు ప్రమాదంలో మృతి చెందిన హిందీ ఉపా ధ్యాయుడు దాసరి చంద్రశేఖర్‌ అం త్యక్రియలు డొంక లూరు శ్మశాన వా టికలో శుక్రవారం నిర్వహించారు. మృ తుడికి ఇద్దరు ఆడపిల్లలు. వారు 12 ఏళ్లలోపు వారు కావడంతో భార్య వనితాకుమారి భర్త కు అంత్యక్రియలు నిర్వహించారు. ఉపాధ్యాయుడిగా, గాయకుడిగా, లైబ్రరీ వ్యవస్థాపకుడిగా చంద్రశేఖర్‌ చేసిన సేవలను మననం చేసుకుంటూ గ్రామ స్థులు కన్నీటి పర్యంతమయ్యారు. భర్త చితికి భార్య నిప్పుపెట్టిన దృశ్యం అక్కడికి వచ్చిన వారిని కలచివేసింది. అంత్యక్రియల్లో సోంపేట జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ మోహన్‌రావు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

శ్రీముఖలింగేశ్వరుని ఆదాయం రూ.2.58 లక్షలు

జలుమూరు, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): దక్షిణ కాశీగా ప్రసిద్ధిచెందిన శ్రీముఖలింగేశ్వరస్వామి హుండీ ఆదాయం రు.2,58,628 వచ్చినట్టు ఈవో ఏడుకొండలు తెలిపారు. పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం శ్రీముఖలింగేశ్వర దేవాలయంలో గల హుండీని తెరచి లెక్కించారు. మూడునెలలకు గాను స్వామివారి హుండీ ఆదాయం లెక్కించినట్లు ఆయన తెలిపారు. మందస ఈవో సింగూరు నాగేశ్వరరావు పర్యవేక్షణలో హుండీ లెక్కించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి చైర్మన్‌ శివప్రసాద్‌ పాడి, అర్చకులు, దేవదాయ సిబ్బంది పాల్గొన్నారు.

7జేఎల్‌ఎం2:ఆదాయాన్ని లెక్కిస్తున్న సిబ్బంది

Updated Date - Aug 08 , 2026 | 12:15 AM