Share News

వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:09 AM

సామాజిక ఆసుపత్రిలో 24 గంటలు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉన్నా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తరచూ రోగులు అవస్థలు పడే పరిస్థితి ఎదురవు తోంది. ఇదేవిధంగా మంగళవారం రాత్రి ఓ ఘటన జరిగింది.

 వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు

అందుబాటులో ఉండడం లేదని రోగి బంధువుల ఆవేదన

పొందూరు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): సామాజిక ఆసుపత్రిలో 24 గంటలు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉన్నా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తరచూ రోగులు అవస్థలు పడే పరిస్థితి ఎదురవు తోంది. ఇదేవిధంగా మంగళవారం రాత్రి ఓ ఘటన జరిగింది. రాత్రి 7.30 గంటల సమయంలో పట్టణానికి చెందిన ఐదేళ్ల బాలుడు జాకా హర్షవర్థన్‌ రాజు స్పృహ కోల్పోయాడు. వెంటనే తండ్రి బాలుడిని సామాజిక ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే ఆ సమయంలో రెగ్యు లర్‌ వైద్యుడు లేకపోవడంతో హౌస్‌ సర్జన్‌ ప్రథమ చికిత్స చేశారు. మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం వెళ్లాలని సూచించడంతో బాలుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈలోగా సదరు వైద్యుడు ప్రసాదరెడ్డి వచ్చి చికిత్స అందించారు. బ్రెయిన్‌కు స్కాన్‌ అవసరం కావడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. దీనిపై డాక్టర్‌ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. తాను ఆ సమయంలో భోజనం చేసేం దుకు వెళ్లానని, తిరిగి వచ్చి బాలుడికి చికిత్స అందించినట్లు తెలిపారు. వైద్యులు అందుబాటులో ఉండడం లేదని రోగుల బంధువులు వాపోతున్నారు.

Updated Date - Aug 12 , 2026 | 12:09 AM