Share News

అదుపు తప్పి.. డివైడర్‌పైకి ఎక్కి

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:56 PM

మండలంలోని కంబిరిగాం జాతీయరహదారి వద్ద బుధవారం ఉదయం సిమెంట్‌ గొట్టాలతో వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్‌పైకి దూసుకువెళ్లింది. అవతలిరోడ్డులోకి వెళ్లి నిలిచిపోవడంతో పెనుప్రమాదం తప్పింది.

అదుపు తప్పి.. డివైడర్‌పైకి ఎక్కి
కంబిరిగాం వద్ద అవతలి రోడ్డులోకి దూసుకువెళ్లిన లారీ:

పలాసరూరల్‌, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): మండలంలోని కంబిరిగాం జాతీయరహదారి వద్ద బుధవారం ఉదయం సిమెంట్‌ గొట్టాలతో వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్‌పైకి దూసుకువెళ్లింది. అవతలిరోడ్డులోకి వెళ్లి నిలిచిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికుల కథనం మేరకు.. ఒడిశా నుంచి విశాఖపట్నం వైపు భారీ గొట్టాలతో వెళ్తున్న లారీ ఒక్క సారిగా ఫ్లైఓవర్‌ దాటిన అనంతరం అదుపు తప్పి సబ్‌రోడ్డుకు వైపు వాలి పోయింది.ఆ సమయంలోవాహనాలు సబ్‌ రోడ్డులో రాకపోకలు లేకపోవ డంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతాఊపిరిపీల్చుకున్నారు. సంఘటనా స్థలానికి పోలీసు లు చేరుకొని కేసు నమోదుచేశారు. అనంతరం లారీని పైకి తీసుకువ చ్చేందుకు సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు.

Updated Date - Feb 04 , 2026 | 11:56 PM