నదీ పరివాహక ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించండి
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:47 PM
వంశధార నదీ పరివాహక ప్రాంతాల గ్రామాల్లో ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో వైద్య శిబిరాలు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఈవీఎన్ నరేష్‌కుమార్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం సరుబుజ్జిలిలోని జిల్లాపరి షత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న తుఫాన్ వరద బాధిత పునరా వాస కేంద్రాన్ని పరిశీలించారు.
సరుబుజ్జిలి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): వంశధార నదీ పరివాహక ప్రాంతాల గ్రామాల్లో ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో వైద్య శిబిరాలు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఈవీఎన్ నరేష్‌కుమార్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం సరుబుజ్జిలిలోని జిల్లాపరి షత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న తుఫాన్ వరద బాధిత పునరా వాస కేంద్రాన్ని పరిశీలించారు. పునరావాసకేంద్రంలో ఉంటున్న తుఫాన్ బాధితుల వైద్య ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్న డీఎంహెచ్ వో మండల వైద్యాధికారి ఎస్.సాహితీప్రియదర్శిని ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న తుఫాన్ వరద బాధిత పునరావాస కేంద్రాన్ని కూడా సందర్శించారు. జిల్లా అధికారులు ఆదేశాలు వచ్చే వరకు వరద ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు కొనసాగించాలని తెలిపారు. వంశ ధార నదీ పరివాహక ప్రాంత గ్రామాల్లో ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకముందే సరుబుజ్జిలి, పురుషోత్తపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆ ప్రాం తాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టడంతోపాటు ఆరో గ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించి వైద్య శిబిరాలను ఏర్పా టు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీహెచ్‌వో మోహన్‌రావు ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.