Share News

రెండు నెలలకే.!

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:30 AM

సరైన రహదారి లేక ఏళ్ల తరబడి అక్కడి గిరిజనులు నరకయా తన అనుభవించారు.

రెండు నెలలకే.!
తారు రోడ్డుపై తేలిన మెటల్‌

  • తారు రోడ్డు నిర్మాణంలో నాణ్యతా లోపం

హిరమండలం, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): సరైన రహదారి లేక ఏళ్ల తరబడి అక్కడి గిరిజనులు నరకయా తన అనుభవించారు. ఎట్టకేలకు ఆయా గిరిజన గ్రామాలకు ప్రభుత్వం తారు రోడ్డు (బీటీ) మంజూరు చేసింది. దీంతో అక్కడ ప్రజలు ఆనందపడ్డారు. తాము పం డించిన పంటలను మార్కెట్‌కు తరలించేందుకు ఇబ్బందులు తొలగనున్నాయని భావించారు. కానీ వేసి రోడ్డులో నాణ్యత లేకపోవడంతో ఇప్పుడు వారంతా నిట్టూ రుస్తున్నారు. వేసిన తారు రహదారి రెండు నెలలకే ధ్వంసం అవ్వడంతో అధికా రులు, కాంట్రాక్టర్‌ తీరుపై మండిపడుతున్నారు. మండలంలోని మర్రిగూడ పంచా యతీ పరిధి దాసుమనుగూడ జంక్షన్‌ నుంచి మర్రిగూడ రోడ్డు జంక్షన్‌ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి పల్లెపండగలో భాగంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కిలోమీటరుపైగా తారురోడ్డు నిర్మాణానికి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు నుం చి రూ.కోటి నిధులు కేటాయించారు. ఈ నిధులతో తారురోడ్డు నిర్మాణం జరిపి పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించారు. నాణ్యత లేకపోవడంతో ఎక్కడికక్కడ ఊడిపోయి రాళ్లు తేలిపోతున్నాయి. నిర్మించిన రెండు నెలలకే ఇలా తయారవ్వడంపై సర్వత్రా విమర్శలు నిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ట్రైబుల్‌ వె ల్ఫేర్‌ ఈఈ రమాదేవి దృష్టికి తీసుకువెళ్లగా.. రహదారిని పరిశీలిస్తామని, నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Updated Date - Apr 06 , 2026 | 12:30 AM