Share News

పల్లెపోరులో ఏకపక్షం

ABN , Publish Date - Nov 25 , 2026 | 12:04 AM

పంచాయతీ ఎన్నికల సమరంలో జిల్లాలో టీడీపీ తన హవా చాటుకుంటోంది. పోలింగ్‌ కు ముందే పల్లెల్లో ‘సైకిల్‌’ జోరు స్పష్టంగా కనిపిస్తోంది. తొలి, రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో జిల్లాలో ఏకంగా 76 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ ఏకగ్రీవమైన పంచా యతీలన్నీ టీడీపీ మద్దతుదారుల ఖాతాలోకే వెళ్లడంతో ఆ పార్టీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది.

పల్లెపోరులో ఏకపక్షం

రెండు విడతల్లో 76 పంచాయతీలు ఏకగ్రీవం

అన్నీ టీడీపీ ఖాతాలోకే..

30 ఏకగ్రీవాలతో మొదటి స్థానంలో పాతపట్నం

శ్రీకాకుళం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల సమరంలో జిల్లాలో టీడీపీ తన హవా చాటుకుంటోంది. పోలింగ్‌ కు ముందే పల్లెల్లో ‘సైకిల్‌’ జోరు స్పష్టంగా కనిపిస్తోంది. తొలి, రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో జిల్లాలో ఏకంగా 76 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ ఏకగ్రీవమైన పంచా యతీలన్నీ టీడీపీ మద్దతుదారుల ఖాతాలోకే వెళ్లడంతో ఆ పార్టీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది.

కూటమిపై నమ్మకం.. ప్రోత్సాహకాలు

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఏకపక్షంగా కూటమి వైపు నిలబ డడం ఈ ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వ పాలనపై నమ్మకంతో పాటు, ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభు త్వం భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించడంతో ప్రజలు కూటమికి మద్దతిచ్చారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

పలాసలో బోణీ.. టెక్కలి డివిజన్‌లో దూకుడు

జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పలాస డివిజన్‌ పరిధిలో 21 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇలా మొదలైన టీడీపీ జైత్రయాత్ర రెండో విడతలో మరింత వేగం పుంజుకుంది. రెండో విడత ఎన్నికలు జరుగుతున్న టెక్కలి డివిజన్‌ పరిధిలో ఏకంగా 55 పంచాయతీలు ఏకగ్రీవమై టీడీపీ మద్దతు దారుల వశమయ్యాయి. వీటిలో టెక్కలి నియోజకవర్గంలోనే 25 పంచాయతీలు ఏకగ్రీవం కావడం గమనార్హం

జిల్లాలోనే అగ్రస్థానంలో పాతపట్నం

ఏకగ్రీవ పంచాయతీల విషయంలో పాతపట్నం నియోజకవర్గం జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఒక్క నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల్లో రికార్డు స్థాయిలో 30 గ్రామ పంచా యతీలు ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా మెళియాపుట్టి మండ లంలో 8 (పట్టుపురం, గోకర్ణపురం, వసుంధర, పడ్డ, ముకుంద పురం, కొత్తూరు, సవర కొలిగాం) పంచాయతీలు ఏకగ్రీవమ య్యా యి. పాతపట్నం మండలంలో 7 (తీమర, ఏఎస్‌ కవిటి, కొరస వాడ, శోభ, పెద్ద సరియాపల్లి, సరళి, రొమదల), కొత్తూరు మండ లంలో 6 (ఆల్తి, మాకవరం, ఒండ్రుజోల, ఇరపాడుగూడ, హంస, అడ్డంగి), ఎల్‌ఎన్‌పేట మండలంలో 5 (బొట్టడసింగి, చొర్లంగి, కోవిలం, కరకవలస, కొమ్మువలస), హిరమండలం మండ లంలో 4 (కొమనాపల్లి, ధనుపురం, మర్రిగూడ, పెద్దగూడ) పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో టీడీపీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నాయి.

Updated Date - Nov 25 , 2026 | 12:04 AM