Share News

‘ఆత్మనిష్ట కలిగిన వాడే ముని’

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:41 PM

ఆత్మనిష్ట కలిగిన వాడే ముని అని నిష్టల నరసింహమూర్తి అన్నారు.

‘ఆత్మనిష్ట కలిగిన వాడే ముని’
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న శ్రీరామశర్మ

శ్రీకాకుళం కల్చరల్‌, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ఆత్మనిష్ట కలిగిన వాడే ముని అని నిష్టల నరసింహమూర్తి అన్నారు. ఉపనిషన్మిందిరం వజ్రోత్సవాల సందర్భంగా శుక్రవారం శ్రీకోదండరామా లయంలో ‘సన త్సుజాతీయం’ అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. సత్పురుషులకు సత్యమే వ్రతం అని ఆత్మనిష్ట కలిగి దానిని ఎరిగిన వాడై ఉండాలన్నారు. మానవులు దోషాలు లేకుం డా సత్యగుణాలను అలవరచుకోవడం కర్తవ్యంగా భావించాలన్నారు. దీపావళి పర్వదినం అంతరార్థాన్ని వివరించారు. వక్తను స్వామి పర మాత్మానంద సరస్వతి సత్కరించారు. కార్యక్రమంలో భాస్కరభట్ల శ్రీరామశర్మ, తిరుపతిరావు, ఏఎస్‌భట్లు, వేదుల సూర్యనారాయణ, డా.మోహనరావు, డా.కోమలరావు, అప్పారావు, కామేశ్వరరావు, డా.శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 11:41 PM