Share News

తల్లిదండ్రుల పోషణను విస్మరించరాదు

ABN , Publish Date - Aug 13 , 2026 | 11:24 PM

వృద్ధులైన తల్లిదండ్రులకు పోషణ బాధ్యతను పిల్లలు విస్మరించకూడదని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు అన్నారు.

తల్లిదండ్రుల పోషణను విస్మరించరాదు
మాట్లాడుతున్న న్యాయాధికారి హరిబాబు

కోటబొమ్మాళి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): వృద్ధులైన తల్లిదండ్రులకు పోషణ బాధ్యతను పిల్లలు విస్మరించకూడదని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు అన్నారు. స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో తల్లిదండ్రులు పరిరక్షణ- హక్కుల చట్టాలపై గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా హక్కు, ఉచిత న్యాయ సహాయం కోసం టోల్‌ ఫ్రీ నెంబర్‌, బాల్య వివాహాల నిరోధంపై అవగాహన కల్పించారు. వృద్ధులను పిల్లలు పట్టించుకోకుంటే ఆర్‌డీవోకు దరఖాస్తు పెట్టుకుంటే పోషణ నిమిత్తం పిల్లల నుంచి కొంతమొత్తాన్ని ఇప్పిస్తారని తెలిపాపరు. ఆస్తులు పిల్లల పేరున రాసి... వృద్ధాప్యంలో వారు ఆదుకోకపోతే ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమాచార చట్టం ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం స్థానిక శ్రీ కొత్తమ్మతల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రోణంకి ఉమామల్లేశ్వరరావు, ఎంపీడీవో కె. నారాయణరావు, కోటబొమ్మాళి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లఖినేని శ్రీనివాస్‌, స్థానిక ఎస్‌ఐ వి.సత్యనారాయణ, ఏపీవో జి.హరిప్రసాద్‌, ఏపీఎం సూర్యనారాయణ, ఈవో బోరక నరేష్‌, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2026 | 11:24 PM