లోక్‌అదాలత్‌ను వినియోగించుకోవాలి
ABN , Publish Date - Jun 25 , 2026 | 11:24 PM
లోక్‌అదాలత్ వినియోగించుకోవాలని ఆరో అదనపు జిల్లా న్యాయా ధికారి కోడూరు కిశోర్ కోరారు.
సోంపేట, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): లోక్‌అదాలత్ వినియోగించుకోవాలని ఆరో అదనపు జిల్లా న్యాయా ధికారి కోడూరు కిశోర్ కోరారు. గురువారం సోంపే టలోని కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్‌అదాలత్‌పై న్యాయవాదులు, పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కేసుల వివరాలను పోలీసులకు అడిగితెలుసుకున్నారు. కాగా సోంపేట జూనియర్ కళాశాలలో డ్రగ్స్‌పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు, డి.జగన్నాఽథం, షణ్ముఖ, ఎక్సైజ్ సీఐ రమణ, ప్రిన్సిపాల్ మోహనరావు పాల్గొన్నారు.