విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:49 PM
రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు.
ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్
లావేరు, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. లావేరుకు నూత నంగా మంజూరైన జ్యోతి బాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల తాత్కాలిక భవనాల నిర్మాణానికి ఆదివారం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 10 గురు కులాలు మంజూరైతే వాటిలో ఎచ్చెర్ల నియోజక వర్గానికి ఒకటి మంజూరు చేయడం ఆనందంగా ఉందన్నారు. పాఠశాల మంజూరుకు సహకరిం చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యాశాఖామంత్రి నారా లోకేష్, వ్యవ సాయశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు లకు కృతజ్ఞతలు తెలిపారు. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ఈ పాఠశాల ఏర్పాటు చేస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకో వాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ముప్పిడి సురేష్, ఏఎంసీ చైర్మన్ నిడిగంట్ల పద్మ, ప్రిన్సిపాల్ అర్బన్, ఏఎంసీ మాజీ చైర్మన్ తోటయ్య దొర, పీఏసీఎస్ అధ్య క్షుడు కె.దామోదరరావు, టీడీపీ నాయకులు లంక నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.