Share News

విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:47 PM

విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడల ద్వారా శరీర ధారుఢ్యంతోపాటు మానసిక వికాసం కలుగుతుందని మూడో అదనపు జిల్లా న్యాయాధికారి వివేకానంద శ్రీనివాస్‌ అన్నారు.

 విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
జిల్లాస్థాయి విజేతలతో అతిథులు

మూడో అదనపు జిల్లా న్యాయాధికారి వివేకానంద శ్రీనివాస్‌

శ్రీకాకుళం స్పోర్ట్స్‌, జూలై 12(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడల ద్వారా శరీర ధారుఢ్యంతోపాటు మానసిక వికాసం కలుగుతుందని మూడో అదనపు జిల్లా న్యాయాధికారి వివేకానంద శ్రీనివాస్‌ అన్నారు. స్థానిక శాంతినగర్‌ కాలనీలోని డీఎస్‌ ఏ ఇండోర్‌ స్టేడియంలో రెండు రోజుల నుంచి జరుగుతున్న జిల్లాస్థాయి బ్యాడ్మింటన్‌ చాంపి యన్‌షిప్‌ పోటీలు ఆదివారం ముగి శాయి. వివిధ విభాగాల్లో విజేతలకు ఆయన బహుమతులు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గెలుపు ఓటములు సహజమని.. నేటి ఓటమి రేపటి గెలుపునకు నాంది అని అన్నారు. పోటీల్లో క్రీడాస్ఫూర్తిని అలవరచు కోవాలన్నారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్‌ సంఘం ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ బైరి దామో దరరావు, కార్యదర్శి ఎం.అశోక్‌ కుమార్‌, ట్రెజరర్‌ జి.అనిల్‌ కుమార్‌, సభ్యులు జి.ప్రసాద్‌, ఎం. రత్నాజీరావు, టి.జయరామ్‌, ఎం.శాంతి కుమార్‌, సీఈవో సంపతిరావు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2026 | 11:47 PM